ఆగస్టు 15న రావాల్సిన ‘పుష్ష 2’ డిసెంబరుకి వెళ్లిపోయింది. సినిమా ఎప్పుడైతే వాయిదా పడిందో, అప్పటి నుంచి షూటింగ్ మరింత నత్త నడక నడుస్తోంది. ప్రస్తుతం ‘పుష్ష 2’ షూట్‌కి బ్రేక్ ఇచ్చారు. కారణం.. సుకుమార్ అమెరికాకు వెళ్లడమే. ఓ వారంలో తిరిగి వస్తారు. వచ్చాక మళ్లీ షూటింగ్ ప్రారంభం అవుతుంది. నిజానికి ఇది అనుకోని బ్రేక్ మాత్రమే. ఈవారంలోనే రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశారు. అయితే ఈ సన్నివేశంలో పాల్గొనే కీలకమైన నటుడికి స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందట. ఆయన షూటింగ్ కి డుమ్మా కొట్టడంతో.. సడన్ గా కాన్సిల్ చేయాల్సిన పరిస్థితి. ఈ గ్యాప్ లో సుకుమార్ అమెరికా వెళ్లిపోయాడు. ఆయన ఈ వీకెండ్ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చాక.. ‘పుష్ష 2’ షూటింగ్ ప్రారంభం అవుతుంది.
ఈ జనవరి నుంచి ‘పుష్ష 2’ షూటింగ్ అనుకొన్నది అనుకొన్నట్టు జరగడం లేదు. సడన్ గా కాన్సిల్ చేయడం, షెడ్యూల్స్ వాయిదా వేయడం పరిపాటిగా మారింది. దానికి రకరకాల కారణాలు. అందుకే ఆగస్టు 15న రావాల్సిన సినిమా, వాయిదా వేయాల్సివచ్చింది. సుకుమార్ ఇలానే తాయితీగా సినిమా తీస్తానంటే, డిసెంబరు నాటికైనా వస్తుందా, రాదా అనే అనుమానాలు మొదలయ్యాయి. సుకుమార్ తో ఎలాగైనా ఈ సినిమా స్పీడు స్పీడుగా పూర్తి చేయించాలని నిర్మాతలు తెగ హైరానా పడుతున్నారు. మరోవైపు బన్నీ కూడా అనుకొన్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తవ్వలేదన్న అసహనంతో ఉన్నాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.