ప్రతిరోజూ పండగే తరవాత.. గోపీచంద్ తో సినిమా చేయడానికి ఫిక్సయ్యాడు మారుతి. అదే.. `పక్కా కమర్షియల్`. అయితే.. ఈ కథ రవితేజ కోసం రాసుకున్నాడు మారుతి. ` ఈసినిమా నేను చేస్తా` అని రవితేజ మాటిచ్చాకే.. మారుతి స్క్రిప్టు పనుల్లోకి దిగాడు. కానీ.. చివర్లో హ్యాండిచ్చాడు రవితేజ. దాంతో.. మారుతి గోపీచంద్ దగ్గరకు వెళ్లాల్సివచ్చింది. పారితోషికం నచ్చకే.. రవితేజ ఈ సినిమాని వదులుకున్నాడని టాలీవుడ్ లో ఓ టాక్ వినిపిస్తోంది. అయితే… రవితేజ `నో` చెప్పడానికి మరో బలమైన కారణం ఉంది.
ఇటీవల నక్కిన త్రినాథరావు కథకి రవితేజ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ కాంబోకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా కోసమే.. మారుతి ప్రాజెక్టుని రవితేజ వదులుకున్నాడట. నక్కిన త్రినాథరావు కథలో హీరో ఓ లాయర్. ఆ కథ కూడా కోర్టు నేపథ్యంలో సాగుతుంది. మారుతి కథలోనూ… హీరో లాయరే. అది కూడా కోర్టు నేపథ్యంలో సాగే కథే. వరుసగా.. రెండు సినిమాల్లోనూ లాయర్ పాత్రలే చేయడం రవితేజకు ఇష్టం లేదు. అందుకే రెండు కథల్లో… కొత్తగా ఏముందా? అని ఆలోచించి.. చివరికి నక్కిన త్రినాథరావు కథకి ఓటేశాడట. అదే సమయంలో.. నక్కిన లాయర్ కథ కాకుండా మరో కథ చెబితే… రెండు కథలూ పట్టాలెక్కేవేమో..?