చిత్తూరు జిల్లాలో చక్రం తిప్పిన మాజీ మంత్రి పెద్దిరెడ్డికి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లుంది. తన సొంత నియోజకవర్గం పుంగనూరులో… తన సొంత క్యాడర్ తిరగబడుతున్నారు. ఇటీవలే పెద్దిరెడ్డిని కాదని, పుంగనూరు మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేయగా, ఇప్పుడు మిగతా క్యాడర్ కూడా అదే బాటలో నడుస్తున్నారు.
తాజాగా పులిచెర్ల మండల జెడ్పీటీసీ మురళీధర్ వైసీపీకి బై బై చెప్పారు. ఆయనతో పాటు ఇద్దరు వైస్ ఎంపీపీలు, పలువురు సర్పంచ్ లు, నలుగురు ఎంపీటీసీలు మూకుమ్మడిగా రాజీనామాను ప్రకటించారు. తమ నేత తమను పట్టించుకోవటం లేదని, కూటమి గాలిలోనూ పెద్దిరెడ్డిని గెలిపిస్తే… తమను పట్టించుకోవటం లేదన్న బాధతోనే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.
ఎన్నో ఏళ్లుగా పెద్దిరెడ్డి చెప్పిందే వేదం అన్నట్లుగా సాగాయి పుంగనూరు పాలిటిక్స్. అలాంటిది తనతో పాటు ఉన్న నేతలు, క్యాడర్ ఇప్పుడు కాదని వెళ్లిపోతున్నారు. ఇప్పటికే పుంగనూరు మున్సిపాలిటీ టీడీపీ వశం అయ్యింది.
త్వరలో పుంగనూరులో మరిన్ని వలసలుంటాయని… పునాదులు కదులుతున్నాయంటోంది టీడీపీ.