పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తయారవుతున్న మాస్ ఎంటర్టైనర్ `లైగర్`. విజయ్ చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. మైక్ టైసన్‌ని బరిలోకి దింపడం, పూరి మార్క్ యానక్షన్ ఎంటర్టైనర్ తోడవ్వడం, విజయ్ కి ఉన్న క్రేజ్.. ఇవన్నీ `లైగర్`కి హైప్ తీసుకొచ్చాయి. దాంతో పాటు బాలీవుడ్ లో ఈ సినిమాకి కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దాంతో… `లైగర్`పై భారీ అంచనాలు మొదలైపోయాయి. దానికి తగ్గట్టే ఈ సినిమా నాన్ థియేటరికల్ రైట్స్ హాట్ కేకులా అమ్ముడైపోయింది. దాదాపు రూ.98 కోట్లకు ఓటీటీ, శాటిలైట్ రైట్స్ రెండూ హాట్ స్టార్ కొనేసింది. ఇది నిజంగా అదిరిపోయే రేటే!
ఈ సినిమాకి రూ.160 కోట్ల వరకూ బడ్జెట్ అయినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్, కరోనా ఎఫెక్ట్ లేకపోతే… రూ.130 కోట్లలోనే సినిమా పూర్తయ్యేది. పెరిగిన వడ్డీలు, షెడ్యూల్ మార్పులు, ఆర్టిస్టుల డేట్లు మళ్లీ సర్దుబాటు చేయడం.. ఇలాంటి వ్యవహారాలతో బడ్జెట్ పెరిగింది. అయినా సరే నిర్మాతలకు ఏం ఇబ్బంది కాలేదు. నాన్ థియేటరికల్ నుంచే రూ.98 కోట్లు తెచ్చుకొందంటే, థియేటరికల్ నుంచి అంతకంటే ఎక్కువే ఆశించొచ్చు. రేపు ట్రైలర్ వస్తోంది. అది గనుక పూరి స్టైల్ లో మాసీగా ఉంటే, ఈ సినిమా కొనడానికి బయ్యర్లు మరింత ఎగబడే అవకాశం ఉంది. ఈమధ్య కాలంలో `లైగర్`కి జరిగినంత బిజినెస్ ఏ సినిమాకీ జరగి ఉండకపోవొచ్చన్నది ట్రేడ్ వర్గాల టాక్. థియేటరికల్ రైట్స్ కూడా ఓ కొలిక్కి వచ్చేస్తే.. `లైగర్` వాల్యూ ఎంతన్నది అర్థమైపోతుంది. `ఇస్మార్ట్ శంకర్`తో లాభాలు గడించిన పూరికి.. ఇది మరో ప్రాఫిట్ ప్రాజెక్ట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.