‘పుష్ప 2’ రికార్డుల వేట మొదలైపోయింది. ఆడియో రైట్స్ విషయంలో పుష్ప 2 కొత్త రికార్డ్ సృష్టించింది. పుష్ప పాటలన్నీ హిట్టే. ఆ సినిమా విజయంలో ఆడియో కీలక పాత్ర పోషించింది. అందుకే పుష్ప 2 ఆడియో రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. టీ సిరీస్ సంస్థ అన్ని భాషల ఆడియో రైట్స్ ని దాదాపుగా రూ.65 కోట్లకు కొనుగోలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియన్ సినిమా హిస్టరిలో ఇదే రికార్డ్. ఆర్.ఆర్.ఆర్కు సైతం.. రూ.30 కోట్లే వచ్చాయి. వాటితో పోలిస్తే… పుష్ప రెట్టింపు ధరని సొంతం చేసుకొన్నట్టే.
సుకుమార్ – దేవిశ్రీ ప్రసాద్‌లది సూపర్ హిట్ మ్యూజికల్ కాంబో. సుకుమార్‌కి దేవి ఎప్పుడిచ్చినా అదిరిపోయే ఆల్బమే ఇచ్చాడు. పుష్ప అందుకు నిదర్శనం. తెలుగులోనే కాదు, బాలీవుడ్ లోనూ ఈ పాటలన్నీ హిట్టే. ఆర్.ఆర్.ఆర్ అంత సూపర్ హిట్ అయినా సరే, నాటు నాటు పాట మినహాయిస్తే.. ఏ పాటా రిజిస్టర్ కాలేదు. ముఖ్యంగా మిగిలిన భాషల్లో. కానీ పుష్ప పాటలు మాత్రం భాషలకు అతీతంగా ఆదరణ పొందాయి. అందుకే… ఆడియో రైట్స్ ఈ స్థాయిలో అమ్ముడయ్యాయి. ఆడియో రైట్స్ ఈ రేంజ్లో పలికితే – ఇక థియేటరికల్ రైట్స్, ఓటీటీల మాటేంటో..?