విజయవాడ వాసులకు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. బుడమేరుకు మళ్లీ ఏ క్షణమైనా వరద పోటేత్తవచ్చని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్చరించారు.
రోజూ భారీ వర్షాలు కురుస్తున్నాయి, ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది… దీంతో బుడమేరుకు మళ్లీ వరద భారీగా వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో సింగ్ నగర్, గుణదల కాలనీల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
అయితే, వరద వస్తే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధికారులు అప్రమత్తం అవుతున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు రక్షణ చర్యలు చేపడుతున్నారు.
మరోవైపు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.