నారా లోకేష్ గతంలో ప్రకటించిన రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఉన్నాయో ఎవరికీ తెలియదు. కానీ టీడీపీ క్యాడర్ మాత్రం రెడ్ బుక్ అమలు ఎప్పుడు అని అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రశ్నించడం ప్రరంభించారు. ఇప్పటికి దాదాపుగా నాలుగు నెలలు అవుతోంది. ఇటీవల నారా లోకేష్ రెడ్ బుక్ అమలు ప్రారంభమయిందని ప్రకటించేశారు. కానీ క్యాడర్ ఎక్స్ పెక్టేషన్స్ వేరు . వారు వైల్డ్ గా అమలు చేయాలని కోరుకుంటున్నారు.
వైల్డ్ యాక్షన్ కోరుకుంటున్న క్యాడర్
రెడ్ బుక్ అమలు అంటే సాధారణ క్యాడర్ కోరుకుంటున్నది తమపై గతంలో వేధింపులకు పాల్పడిన వారిపై.. పార్టీ నాయకత్వంపై తప్పుడు కేసులు పెట్టిన వారిపై అందరికీ తెలిసేలా కఠిన చర్యలు తీసుకోవడం. అంటే వైసీపీ తరహాలో ఉదయం అందుబాటులో ఉన్నప్పటికీ వదిలేసి రాత్రి పూట నిద్రపోయేటపప్పుడు కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురి చేసి తలుపులు బద్దలుకొట్టి అరెస్టు చేయడం వంటి సైకో పనులకు పాల్పడానలని కోరుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. వైసీపీ చేసిన దాని కన్నా ఎక్కువ చేయాలనుకుంటున్నారు.
పద్దతిగా అంటుకట్టినట్లుగా రెడ్ బుక్ యాక్షన్
అయితే టీడీపీ అధినాయకత్వం, నారా లోకేష్ మాత్రం రాజకీయాల్లో ఆవేశం, కక్ష తీర్చేసుకోవాలన్న ఆరాటం వల్ల నష్టమే కానీ లాభం ఉండదని గుర్తు చేసుకున్నారు. అందుకే రెడ్ బుక్లో పర్లు ఉన్న వారందరిపై మూడు నెలల పాటు కంప్లీట్ సమాచారం సేకరించారు. ఇప్పుడు వారిని పద్దతిగా చట్టం ముందు నిలబెట్టేందుకు సిద్దమవుతున్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా తప్పించుకునే అవకాశాల్లేవని అంతా చట్టబద్ధంగా శిక్షలు ఎదుర్కొంటారని సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయి. కొంత మంది అంతర్గతగా వేడి తగులుగుతోంది. బయటకు తెలిసింది కొంత. లోపల జరుగుతున్న యాక్షన్ కొండంత.
ఈగో చల్లార్చుకోవడం కాదు – శిక్షలు పడేలా చేయడమే !
రెడ్ బుక్ యాక్షన్ అంటే… గతంలో తమను వేధించారు కాబట్టి దానికి ప్రతిగా వారిని కూడా హింసించి ఈగో చల్లార్చుకోవాలన్నట్లుగా ఎక్కవ మంది అభిప్రాయం ఉంది. కానీ అలా అనుకునేవారు రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉండలేరు. ఏదైనా పద్దతిగా గురి చూసి కొట్టే వారికే లాంగ్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. ఆవేశాలు, కక్షలను దాటి… పద్దతిగా తాము చేయాలనుకున్నది చేస్తున్నారు.