ఈ సంక్రాంతికి సినిమాలు బరిలో నిలిచాయి. ఇప్పటికే `క్రాక్` విడుదలైపోయింది. ఇక మాస్టర్, రెడ్, అల్లుడు అదుర్స్ మిగిలాయి. ఒక్కోటీ ఒక్కో డేట్ పంచుకున్నాయి. 13న మాస్టర్, 14న రెడ్, 15న అల్లుడు అదుర్స్ వస్తున్నాయి. డేట్లు ఎప్పుడో ఫిక్స్ చేసేసుకున్నారు. ఇప్పుడు `అల్లుడు అదుర్స్` ఒక రోజు ముందుకు జరిగి.. 14న రావడానికి డిసైడ్ అయ్యింది. అల్లుడు ముందడుగు వేయడానికి రకరకాల కారణాలు. కాకపోతే.. ఈ నిర్ణయం `రెడ్` టీమ్ కి మింగుడు పడడం లేదు.
డేట్లు ముందే ఫిక్స్ చేసుకుని, థియేటర్లు లాక్ చేసుకుంటే, ఇప్పుడు సడన్ గా… ఆఖరి నిమిషాల్లో నిర్ణయం తీసుకోవడం ఏమిటని `రెడ్` టీమ్ వాదిస్తోంది. ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయాల మేరకు.. ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు పోటీ పడడానికి లేదు. ముఖ్యంగా పండగ సీజన్లలో. డేట్లు క్లాష్ రాకుండా… గిల్డ్ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. నిర్మాతల్ని కూర్చోబెట్టి మాట్లాడుతోంది. అయితే.. సడన్ గా `అల్లుడు` డేట్ మారడం.. ఇప్పుడు గిల్డ్ లో సైతం చర్చనీయాంశమైంది. గిల్డ్ సభ్యులు ఇప్పుడు ఇరు నిర్మాతల్నీ పిలిచి మాట్లాడే పనిలో ఉన్నారు. ఈ వ్యవహారాన్ని సైలెంట్ గా సర్దుమణిగిద్దామని చూస్తున్నారు.