తమిళంలో శ్రీరెడ్డి ఓ సినిమా చేస్తుంది. టైటిల్ ‘రెడ్డి డైరీ’. ఈ సినిమా కథలో శ్రీరెడ్డి జీవితంలో జరిగిన అంశాలు చాలా వుంటాయని దర్శక నిర్మాతలు తెలిపారు. చిత్ర పరిశ్రమలో కథానాయికగా వున్నత స్ధాయికి ఎదగాలని వచ్చిన ఒక అమ్మాయిని కొందరు వ్యక్తులు ఎలా ఉపయోగించుకున్నారు? లైంగికంగా ఎలా వేధించారు? అనేది సినిమా కథ అట! ఇది వింటుంటే తెలుగు చిత్ర పరిశ్రమపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు గుర్తొస్తున్నాయా? అది నిజమే. శ్రీరెడ్డి కూడా తన జీవితంలో జరిగిన కొన్ని పేజీలు ‘రెడ్డి డైరీ’లో కనిపిస్తాయని అంటోంది. ఇప్పటికే తమిళ చిత్ర పరిశ్రమలో రాఘవ లారెన్స్, శ్రీరామ్ వంటి నటులపై ఆరోపణలు చేసిన ఆమె, తనకు న్యాయం జరిగేలా చూడాలని మీడియా ముందు విశాల్ కి విజ్ఞప్తి చేస్తోంది. విశాల్ ఈమె ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదని, అందుకని మీడియా ముందు వేడుకుంటున్నానని చెబుతోంది. తెలుగులో ఇంతకు ముందు ఎటువంటి ఆరోపణలు చేసి పబ్లిసిటీ పొందిందో… తమిళంలోనూ అదే విధంగా పబ్లిసిటీ పొందుతోంది. సినిమా కోసం ఇప్పటికే చెన్నై మకాం మార్చిన ఈమె, అక్కడ ఇంకెంత హంగామా చేస్తుందో చూడాలి. కథ గురించి తెలిశాక… సినిమాలో ఎవరెవర్ని టార్గెట్ చేశారోనని తెలుగు సినీ ప్రముఖుల్లో చర్చ మొదలయింది.