ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్న తిరుమల శ్రీనివాసుడు ఓ వర్గం కబంధ హస్తాల్లో చిక్కుకున్నట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వం మారినప్పటి నుంచి కొండపై జరుగుతున్న పరిణామాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్‌గా ఉండేవారు. టీటీడీ ఈవోగా శ్రీవారికి పరమ భక్తుడైన అశోక్ కుమార్ సింఘాల్ ఉండేవారు. టీటీడీ పాలన అంతా.. వీరిద్దరి చేతుల మీదుగానే సాగుతోంది. జేఈవోగా శ్రీనివాసరాజు కూడా కీలకంగా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. టీటీడీ చైర్మన్‌గా ఉన్న సుధాకర్ యాదవ్‌ను బలవంతంగా దించేశారు. జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని చైర్మన్‌గా ప్రకటించారు.
బీసీని తీసేసి రెడ్డి సామాజికవర్గానికి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడంతోనే ఆగిపోలేదు. ఢిల్లీ నుంచి ధర్మారెడ్డి అనే అధికారిని డిప్యూటేషన్‌పై తీసుకు వచ్చి జేఈవోగా నియమించారు. ఈ ధర్మారెడ్డి గతంలోనూ అంటే.. వైఎస్ హయాంలోనూ జేఈవోగా నిర్వహించి వివాదాస్పద పరిస్థితుల్లో పదవిని వదిలిపెటాట్లిస వచ్చింది. ఆయన రాగానే సింఘాల్ ప్రాధాన్యం తగ్గింది. మొత్తం ధర్మారెడ్డి హవా ప్రారంభమయింది. అయితే ఇప్పుడు… సింఘాల్‌ను కూడా తొలగించేసి.. జవహర్ రెడ్డిని టీటీడీ ఈవోగా నియమించేశారు. దీంతో టీటీడీ చైర్మన్, ఈవో, జేఈవో అందరూ … రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే అయిపోయారు. ఇక జంబో పాలక మండలిలో ఆరేడుగురు రెడ్డి సామాజికవర్గ సభ్యులు ఉన్నారు.
శ్రీవారి అందరికీ ఆరాధ్యుడు. ఆయన సన్నిధిలో కొలువ చేయాలని.. సేవ చేయాని ఆరాటపడని అధికారికానీ భక్తులు కానీ ఉండరు. అయితే.. చాలా మంది ఇప్పుడు.. సేవ కంటే ఎక్కువగా.. ఏదేదో ఆశించి కొండ మీద తిష్ట వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఈ విషయంలో శ్రీవారి పవిత్రతను గుర్తుంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుండంగా.. అస్మదీయులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా… రాష్ట్రంలో మరెవరూ లేనట్లుగా.. కొండపై ఒక్క వర్గమే తిష్ట వేసుకుని కూర్చుంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే…ఏపీలో అన్ని నామినేటెడ్ పోస్టుల్లోనూ ఇదే పరిస్థితి ఉందని.. ఒక్క టీటీడీలోనే కాదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.