ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. అందులో పని చేయడానికి సేల్స్మెన్లు, సూపర్ వైజర్లు, సెక్యూరిటీ గార్డులను విడిగా నియమించుకున్నారు. వీరికి నెలకు పదిహేను వేల వరకూ స్థాయిని బట్టిచెల్లింపులు చేస్తున్నారు. ఇంత తక్కువ మొత్తానికి వీరు ఎలా పనిచేస్తున్నారనే సందేహం చాలా మందికి ఉంది. అయితే ఇప్పుడు ఈ ఉద్యోగుల్ని చూపించే.. రెడ్డి ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థ డబ్బులు పిండుకునే ప్రోగ్రాంకు రూపకకల్పన చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరంతా ప్రభుత్వం నేరుగా నియమించుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు. కానీ రెడ్డి ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థ రంగంలోకి వచ్చింది. వారంతా తమ ఉద్యోగులు అని వెబ్సైట్లో చూపించుకుంటోంది. అంటే ఆ సంస్థ తరపున ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ప్రకారం వారిని నియమించుకుందని చెబుతున్నారన్నమాట.
ఈ ఉద్యోగులను కలెక్టర్లు ఏపీబీసీఎల్ కోసం నియమించారు. కానీ రెడ్డి ఎంటర్ ప్రైజెస్ మాత్రం.. వారిని తమ తరపు ఉద్యోగులుగా చెబుతోంది. గుర్తింపు కార్డులు, ఈఎస్ఐ జాబితాలో చేర్చేందుకు ఒక్కొక్కరూ రూ.10 వేలు చెల్లించాలని వారికి సమాచారం పంపింది. లేదంటే జీతాలు రావని కూడా హెచ్చరించింది. దీనిపై ఉద్యోగులు ఫిర్యాదులు చేశారు. దీనిపై ఏపీబీసీఎల్కు ఎండీ వాసుదేవరెడ్డి సైలెంట్గాఉన్నారు. ఆయన డిప్యూటేషన్ పై వచ్చిన ఐఆర్టీఎస్ అధికారి. ఇటీవల … మద్యం దుకాణాల వ్యవహారాల్లో పలు అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. మంత్రి నారాయణ స్వామి విచారణకు కూడా ఆదేశించారు. కానీ ఆయన మాటల్ని పట్టించుకునేవారు లేరు.
తాజాగా.. మద్యం దుకాణాల్లో ఉండే సేల్స్ మెన్లకు.. సూపర్ వైజర్లకు ట్రైనింగ్ ఇవ్వాలంటూ ఏపీబీసీఎల్ టెండర్లు పిలిచింది. ఇప్పటికే పని చేస్తున్న వారికి … రేపోమాపో మద్యనిషేధం విధించే దానికి… ఇంకా చెప్పాలంటే అసలు మద్యం అమ్మడానికి ట్రైనింగ్ ఏంటో చాలా మందికి అర్థం కావడం లేదు. ఆ ట్రైనింగ్ కాంట్రాక్ట్ కూడా.. రెడ్డి ఎంటర్ ప్రైజెస్కే వెళ్తుందని లేకపోతే..మరో బినామీ కంపెనీకి వెళ్తుందని.. అంతా ఓ ఫ్రాడ్ అన్న ఆరోపణలు ఇప్పటి నుంచే ప్రారంభమయ్యాయి. అయితే ఏపీలోఏదైనాసాధ్యమేనని.. రెండేళ్ల నుంచి జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తూనే ఉన్నాయని మరికొంత మంది నిట్టూరుస్తున్నారు.