(రాజకీయాల్లో కులాల కెమిస్ట్రీ-6)
ముద్రగడ దీక్ష ముగిసిపోయాక రాజకీయాల్లో కుల సమీకరణలు ఫలితాలు పర్యావసానాల గురించి రాజకీయ పార్టీల కార్యకర్తల్లో కుల సంఘాల నాయకుల్లో రసవత్తరమైన చర్చలు సాగుతున్నాయి. కాపులు, బిసిలు కలసి ప్రయాణం చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి చాలా ఎక్కువకాలం వేచి వుండనవసరం లేదని రాజమండ్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్ధి చెప్పారు. ఆయన శెట్టిబలిజ కులస్తుడు. గోదావరి జిల్లాల్లో కాపు శెట్టిబలిజలది పాము ముంగిసల బంధం లాంటి సహజ వైరం.
లోహియా మొదలు పూలేవరకూ, మాయావతి నుంచి ఆర్ కృష్ణయ్య వరకూ మొదలు సామాజిక పరిణామాలను వాటికి మూలమైన రాజకీయాలను అధ్యయనం చేస్తున్న ఈ విద్యార్ధి పాలకుల దయాదాక్షిణ్యాల వచ్చే మార్పులు అవసరమే…అంతకు మించి సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అతిముఖ్యం…రకరకాల కాంబినేషన్ల ప్రయోగాలతో సామాజిక సామరస్యానికి పునాదులు వేసిన మాయావతి మాదిరి విశాలమైన దూరదృష్టి గల నాయకులు లేకపోవడం సమకాలీన రాజకీయాల్లో పెద్దలోటని ఆయన అన్నారు.
కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం చంద్రబాబువల్లకాదు. సహజమిత్రులైన రెడ్లు కాపులు కలసిపోతారు. ఇది వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశాన్ని ఇబ్బంది పెడుతుంది అన్నది వాకర్స్ పార్క్ లో రోజూ కలిసే పెద్దల అభిప్రాయం. వీరిలో కమ్మ, రెడ్డి కులస్ధులతోపాటు అనేక ఇతర కులాలవారు కూడా వున్నారు. వీరిలో హెచ్చుమంది విద్యావంతులు, అప్పర్ మిడిల్ క్లాస్ వారే.
కాపులకు రిజర్వేషన్లు ఇస్తే సహించేదిలేదని విజయవాడలో మంగళవారం విడివిడిగా సమావేశమైన తెలుగుదేశం అనుకూల బిసి సంఘం, రాజకీయపార్టీలకు దూరంగా వున్న బిసి సంఘం నిర్ణయించాయి. ఒక సమావేశంలో ఓయువకుడు కిరోసిన్ చల్లుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేయడం ఉద్వేగ ప్రదర్శనగా మిగిలింది.
ఎవరు కావాలో తేల్చుకోవాలని చంద్రబాబుని ఆర్ కృష్ణయ్య హెచ్చరించినట్టుగా కాపులు – బిసిలు మైత్రీ పూర్వకంగా వుండే అవకాశాలు తక్కువే! ముద్రగడకు మద్దతు ప్రకటించి కాపుగర్జన కు పెద్ద హైప్ తీసుకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు తగలబడిపోయాక మాయమైపోయింది. ఇది కడపవాళ్ళ పనేనని పదేపదే అనడం ద్వారా వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు కాపులు అతుక్కుపోకుండా చంద్రబాబు అడ్డుగోడ కట్టగలిగారు. ఈ గోడ ఎన్నికలవరకూ నిలుస్తుందా అన్నది అనుమానమే!
బిసిలతో కలిపి రిజర్వేషన్ కోరుతున్న కాపు మోతుబరుల్లో తాము బిసిలకంటే అధికుల మన్న భావన గాఢంగా వుంది. చదువుకున్న యువతలో కూడా ఈ అభిప్రాయమే వుండటం గమనార్హం. ఇదే వారిని రెడ్లకు దగ్గరగా చేరుస్తుంది. స్వాతంత్రం వచ్చినప్పటినుంచీ జరుగుతున్నది ఇదే! ఈ కాంబినేషన్ కొనసాగినంత వరకూ అధికారంలో కాపులది రెండో స్ధానంగానే వుంటుంది. అలాకాకుండా కాపులు బిసిలు ఒకటి కాగలిగితే అధికారంలో కాపులది మొదటి స్ధానమౌతుంది.
(continued after the image)
(United AP Caste Breakup by an English News Paper : )
ఇది కేవలం అధికారమార్పిడి మాత్రమే కాదు. దిగువ వున్న కులాల వారికి అధికారం సంక్రమించే ఒక ట్రాన్స్ఫర్మేషన్ కూడా…అని పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్ధి విశ్లేషించారు.
రెడ్డి సామాజిక వర్గం రాజకీయ ఆధిపత్యాన్ని ఎన్ టి ఆర్ పెకలించి వేశారు. ఇందులో కమ్మ ప్రాబల్యంకంటే బిసిల ఐక్యతే ప్రధాన పాత్రవహించింది. ఆధిపత్య కులాల్లో కింది కులంగా, కింది కులాల్లో ఆధిపత్యకులంగా వున్న కాపులు పైకి వెళ్ళడానికో అలాగే వుండిపోడానికో వారు ఎంచుకునే సామాజిక సమీకరణమే దారి చూపుతుంది.
సమీప భవిష్యత్తులో కాకపోయినా సుదీర్ఘ భవిష్యత్తులో అయినా కాపులు రాజ్యాధికారానికి వచ్చేవారికి ప్రధాన మద్ధతుదారులుగా వుండటమా, లేక స్వయంగా అధికారంలోకి రావడమా అన్నది పెద్దప్రశ్న! దీనికి సమాధానం కాపుల దోస్తీ రెడ్లతోనా లేక బిసిలతోనా అనేదాన్ని బట్టే వుంటుంది.
గతంలో జరిగిన ఒక ఎన్నికల్లో కులాల వారీగా ఎవరు ఎటు వోటు వేసారో ఒక ఆంగ్ల పత్రిక సర్వే :