రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో నాలుగో భాగంలో ఆరు విమానాశ్రయాల వేలాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వేలం ద్వారా ఆరు ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణ చేస్తామని…12 ఎయిర్‌పోర్టుల్లో ప్రైవేటు పెట్టుబడుల శాతం పెంచుతామని ప్రకటించారు. బొగ్గు, సహజ వనరులు, ఎయిర్‌పోర్టులు, ఎయిర్‌స్పేస్ మేనేజ్మెంట్…డిఫెన్స్ ప్రొడక్షన్, స్పేస్, అణుశక్తి రంగాలకు నాలుగో ప్యాకేజీలో ప్రోత్సాహకాలు ప్రకటించారు. బొగ్గు రంగంలో కమర్షియల్ మైనింగ్కి అనుమతులు ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు. బిడ్డింగ్‌కు అందుబాటులో 50 బొగ్గుగనులు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా కొత్తగా 500 మినరల్ మైన్స్ ఉన్నాయని.. అన్నింటికీ .. తవ్వకం, ఉత్పత్తి, మార్కెటింగ్‌కు అనుమతి ఇస్తామన్నారు.
మైనింగ్‌కు అనుమతి ఇవ్వడం వల్ల ఉపాధికి అవకాశాలు పెరుగుతాయని.. అందుకే.. మైనింగ్ రంగంలో ఇన్ఫ్రాకు రూ.50వేల కోట్లు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు. కోల్ మైన్ యాంత్రీకరణకు రూ.18వేల కోట్లు కేటాయించారు. ఆయుధ దిగుమతులపై దశలవారీగా నిషేధం విధించి… దేశీయంగానే ఆయుధ అనుబంధ ఉత్పత్తులు తయారు చేయబోతున్నట్లుగా అర్థిక మంత్రి ప్రకటించారు. స్థానికంగానే ఆయుధ ఉత్పత్తుల సేకరణకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని… డిఫెన్స్ సెక్టార్లో మేకిన్ ఇండియాకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లుగా స్పషఅటం చేశారు. రక్షణరంగంలో 49శాతం నుంచి 74శాతం వరకు ఎఫ్‌డీఐలు అనుమతిస్తామన్నారు. విమానాశ్రయాల్లో ప్రైవేటు పెట్టుబడుల ద్వారా రూ.12వేల కోట్ల ఆదాయంవస్తుందని.. ప్రయాణ కాలాన్ని తగ్గించేందుకు రూ.1000కోట్లతో ఎఫిషియెంట్ ఎయిర్‌స్పేస్ మేనేజ్మెంట్ అమలు చేయబోతున్నట్లుగా ప్రకటించారు.
విమానాల నిర్వహణలో కంపెనీలకు సివిల్ ఏవియేషన్ నిర్వహణ భారం తగ్గుతుందని నిర్మలాసీతారామన్ చ ెప్పారు. అంతరిక్ష రంగంలోనూ ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహమిస్తామని నిర్మల సీతారామన్ ప్రకటిచారు. అంతరిక్ష ప్రయాణం, పరిశోధనల్లో ప్రైవేటు సంస్థలకు అవకాశం ఇస్తున్నట్లుగా తెలిపారు. సంక్షేమరంగాన్ని ప్రోత్సహించేందుకు రూ.8,100 కోట్లను నిర్మల ప్రకటించారు. కేంద్రపాలిత ప్రాంతాల్లోని డిస్కమ్‌ల ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్నారు.