‘మహానటి’లో సావిత్రి జీవితంలో ఉన్నత శిఖరాలను, ఒడిదుడుకులను చూపించిన దర్శకుడు నాగ అశ్విన్, ఆమె సావిత్రి కుమార్తెను మాత్రం చూపించడం లేదు. తమిళ నటుడు జెమినీ గణేషన్ సతీమణి సావిత్రి అన్న సంగతి తెలిసిందే. అయతే… సావిత్రిని పెళ్లి చేసుకునే సమయానికి ఆయనకు పెళ్లయ్యింది. ఆయనకు మహానటి రెండో భార్య. సావిత్రి సంతానం ఎవరూ సినిమాల్లోకి రాలేదు. కానీ, జెమినీ గణేషన్ మొదటి భార్య కుమార్తె సినిమాల్లోకి వచ్చారు. ఆమె ఒకప్పటి ప్రముఖ దక్షిణాది కథానాయిక, హిందీ నటి రేఖ. సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’లో ఆమె పాత్రను చూపలేదని నాగ అశ్విన్ మాట్లాడారు. ఇంకా ఆయన మాట్లాడుతూ “సావిత్రిగారి లైఫ్ స్టోరీ మొత్తం చెప్పాలని ఉన్నా టైమ్ లిమిట్ ఉంటుంది కదా. ఆమె లైఫ్ లోని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌ని పెట్టాలనిపించి, చాలా రాశాను. తరవాత ఫైనల్ స్క్రిప్ట్ చూసి ఇదంతా తీస్తే… ఎడిటింగ్ లెవెల్లో కష్టమైపోతుందని కొన్ని క్యారెక్టర్స్ ఎడిట్ చేశా” అన్నారు. సో… సావిత్రితో, ఆమె పిల్లలతో రేఖకు ఎలాంటి అనుబంధం ఉందో చూడాలనుకున్న ప్రేక్షకులు ముందుగా ప్రిపేర్ అవ్వండి. సినిమాలో రేఖ లేదు.