ఏ ముహూర్తంలో బ్రహ్మోత్సవం ప్రాజెక్టుకు మహేష్ బాబు అంగీకారం తెలిపాడో గానీ, అప్పటి నుంచీ ఈసినిమాపై బోలెడన్ని అనుమానాలు, రూమర్లు. ఈ సినిమా ఆగిపోయిందని, బడ్జెట్ పెరిగిపోయిందని, దర్శకుడికి క్లారిటీ లేదని.. ఇలా రకరకాలుగా మాట్లాడుకొన్నారు. బ్రహ్మోత్సవం ఇంకా సెట్స్‌పైనే ఉంది. కాబట్టి… ఆ గాసిప్పులకూ పుల్ స్టాప్ పడడం లేదు. తాజాగా బ్రహ్మోత్సవంపై మరో న్యూస్ బయటకు వచ్చింది. అది విని.. మహేష్ ఫ్యాన్స్ షాకైపోతున్నారు.
ఇప్పటి వరకూ బ్రహ్మోత్సవం అవుట్ పుట్ని, రషెష్నీ చూసిన మహేష్ బాబు సినిమాపై పెదవి విరిచాడన్నది ఇన్సైడ్ టాక్. రెండు మూడు సన్నివేశాల మధ్య లింకులు లేవని, కొన్ని సీన్లు మరీ లెంగ్తీగా తయారయ్యాని మహేష్ భావిస్తున్నాడట. ”ఫైనల్ అవుట్ పుట్లో చూసుకొందాం” అని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చెబుతున్నా, ఆ సమాధానంతో మహేష్ సంతృప్తి పడడం లేదని తెలుస్తోంది. ”ఇవన్నీ సెట్లో ఉండగానే చూసుకోవాలి.. లేదంటే.. బుక్కయిపోతాం” అంటూ కాస్త సీరియస్‌గానే చెప్పాడట. ప్యాచ్ వర్క్‌లను నమ్ముకోవొద్దని, ముందే జాగ్రత్తపడాలని సూచించాడట. మరి శ్రీకాంత్ అడ్డాల తన తప్పుల్ని ఎంత వేగంగా సరిదిద్దుకొంటాడో, మహేష్‌ని ఎలా మెప్పిస్తాడో చూడాలి.