ఏపీ బీజేపీ రాజకీయాలకు సంబంధించినంతవరకు వాతావరణం మొత్తం ప్రశాంతంగానే ఉన్నది కదా అని భావిస్తే పొరబాటు. నిజానికి ఇక్కడ వ్యవహారం నివురు గప్పిన నిప్పులా ఉన్నదనడం సబబుగా ఉంటుంది. మరో రకంగా చెప్పాలంటే ఏపీ బీజేపీ ప్రస్తుతం నిలువునా చీలిఉన్నదా అనిపించేలా ఉన్నది. తమ గురించి తాము క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఈ పార్టీ లో ఒకే విషయం మీద పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలతో రెండు వర్గాలు తయారయ్యాయంటే అతిశయోక్తి కాదు. చీలికలు తెచ్చిన ఆ విషయం బీజేపీ ఏపీ రాష్ట్ర నాయకత్వం ఎవరి చేతిలో పెట్టాలనే విషయానికి సంబంధించినది. ఆ వివాదం వెనుక ఉన్న అసలు మర్మం టీడీపీ తో ఎలాంటి వైఖరి అవలంబించాలనేదే కావడం విశేషం.
ఏపీ లో టీడీపీ, బీజేపీ మిత్రపక్షాలుగా కలిసి అధికారాన్ని పంచుకుంటూనే ఉన్నాయి. ఏపీ లో బీజేపీ కి ఉన్న బలం, స్థాయితో పోల్చి లెక్కవేస్తే వారికి అధికారంలో భాగం దక్కడం గొప్ప అవకాశమే. అందువలన ఇప్పటికిప్పుడు టీడీపీ తో సున్నం పెట్టుకునే వ్యక్తి చేతికి పగ్గాలు ఇవ్వకపోవడమే మంచిదని కొందరు వాదిస్తున్నారు. వచ్చే ఎన్నికల సమయానికి పార్టీ సొంతంగా బరిలోకి దిగే పరిస్థితి ఉండాలనే కోరిక మంచిదే అయినా, ఇప్పటికిప్పుడు వాయిరభావం ఉండేవారికి నాయకత్వం వద్దని, నెక్స్ట్ టర్మ్ ఇస్తే చాలునని వారు వాదిస్తున్నారు.
మరొకవైపు ఇప్పటినుంచే టీడీపీ మీద దాడి చేసే జోరు పెంచి బీజేపీ కి సొంత ఇమేజ్ సృష్టించాలనే ఆలోచన కొందరిది. ఏపీ లో ప్రస్తుతం రాజకీయ శున్యత ఉందని, దాన్ని అందిపుచుకోవడంలో ఆలస్యం చేస్తే ఎప్పటికి వెనుకపడిపోతాం అని వీరు వాదిస్తున్నారు. పైగా ఏ సామజిక వర్గంలో తాము బలం పెంచుకోవాలని అనుకుంటున్నామో ఆ వర్గాన్ని, ఈలోగా టీడీపీ హైజాక్ చేస్తుందని కూడా అనుమానాలు చెబుతున్నారు. టీడీపీ ని ఒక ఆటాడు కునే వారి చేతికే పగ్గాలు దక్కాలని వీరి కోరిక.
ఒకటో వాదన కంభంపాటి హరిబాబుకు రెండోసారి అప్పగించాడు అనుకూలం. రెండో వాదన గెలిస్తే సోము వీర్రాజు లేదా పురందేశ్వరి కి ఛాన్స్ దక్కుతుంది. మొత్తానికి అప్ బీజేపీ రెండు వర్గాలు చీలిన మాట నిజమని పార్టీ వారె అంటున్నారు.