నవంబర్ 2న ‘సవ్యసాచి’ విడుదలవుతోంది. ఇది విడుదలైన రెండు వారాలకు ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ (ఎఎఎ) విడుదలవుతోంది. రవితేజ హీరోగా నటించిన ఆ సినిమా నవంబర్ 16న వస్తుంది. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే నిర్మించింది. ‘రెండు వారాల వ్యవధిలో రెండు సినిమాలు విడుదల చేస్తున్నారు. మీ సినిమాకు మీ సినిమా పోటీ అవుతుందేమో?’ అని నిర్మాతలను ప్రశ్నిస్తే… “నవంబర్ 29న ‘రోబో’ విడుదలవుతోంది. డిసెంబర్ 7న విడుదల చేద్దామంటే తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్ 21న నాలుగు సినిమాలు వున్నాయి. అంతకంటే వెనక్కి వెళ్లాలని అనుకున్నా… జనవరిలో పెద్ద సినిమాలు వున్నాయి. వేరే డేట్ దొరక్క నవంబర్ 16న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ని విడుదల చేస్తున్నాం” అని చెప్పారు. రెండు వారాల వ్యవధి వుండటం వలన ‘సవ్యసాచి’కి, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ పోటీ కాదని నిర్మాతలు భావిస్తున్నట్టు వున్నారు. రెండు సినిమాలు బాగా వచ్చాయని, రెండూ విజయం సాధిస్తాయని నిర్మాతలు ధీమాగా వున్నార్ట!