నాపేరు సూర్య, భరత్ అనే నేను రిలీజ్ డేట్ సమస్య… చిత్రసీమలో హాట్ టాపిక్ అయ్యింది. ఒకే రోజు రెండు సినిమాలు ఢీ కొట్టాలని చూసుకుంటున్నాయి. దీనికి కారణం ఎవరు? తెర వెనుక ఏం జరుగుతోంది? అనే ఆసక్తి నెలకొంది. నిజానికి ఒకే రోజు రెండు సినిమాలు రావడం కుదరదన్న సంగతి ఇద్దరికీ తెలుసు. తమలో ఎవరో ఒకరు తగ్గాలనీ తెలుసు. కానీ.. ఆ వెనుకడుగు వేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. అదే ప్రధానమైన సమస్య.
అయితే ఈ ఇష్యూలో ఇప్పటి వరకూ తప్పు మహేష్‌బాబు సినిమాపైనే ఉంది. కానీ ఇప్పుడు ఆ తప్పు… బన్నీ టీమ్ వైపుకు మళ్లింది. నిజానికి ఏప్రిల్ 27న వస్తున్నామని.. ముందు చెప్పింది బన్నీ టీమ్‌నే. కమ్యునికేషన్ గ్యాప్ వల్ల సరిగ్గా అదే రోజున తమ సినిమా రిలీజ్‌డేట్ ఎనౌన్స్ చేసింది భరత్ అనే నేను.
ఆ తరువాత ఈ ఇద్దరు నిర్మాతల మధ్య చర్చలు జరిగాయి ,దాంతో ఈ సమస్యకు పుల్ స్టాప్ పడుతుందని భావించారు. కానీ… గొడవ మళ్లీ మొదలైంది.
ఇటీవల రెండు సినిమాల నిర్మాతలూ కూర్చుని మాట్లాడుకున్నారు. `మేం ఏప్రిల్ 13న రావడానికి కూడా రెడీనే` అని ‘నాపేరు సూర్య’ బృందం మాట ఇచ్చిందని తెలుస్తోంది. అందుకే మహేష్ సినిమా ముందు అనుకున్నట్టే 27న రావడానికి రెడీ అవుతుండగా బన్నీ టీమ్ మాట మార్చిందని సమాచారం. మేం ఏప్రిల్ 26న వస్తున్నామని ప్రకటించింది. దాంతో మహేష్ టీమ్ అవాక్కయ్యింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో మా సినిమా కూడా ఏప్రిల్ 26 నే విడుదల చేయాల్సివస్తోందంటూ భరత్ అనే నేను చిత్రబృందం చెబుతోంది. సో… సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది..రెండు సినిమాల డేట్లు ఏప్రిల్ 26కి వెళ్లాయి.