రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. మధ్యమధ్యలో షార్ట్ బ్రేక్స్ తప్ప, షూటింగ్ శర వేగంగానే నడుస్తోంది. ఈ సినిమాని ఎట్టిపరిస్థితుల్లోనూ 2026 వేసవిలో విడుదల చేయాలన్నది ప్లాన్. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకొన్నారని తెలుస్తోంది. 2026 మార్చి 26న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకొంటున్నారని సమాచారం. మార్చి 27 చరణ్ పుట్టిన రోజు. అందుకే ఈ డేట్ ఫిక్స్ చేశారని సమాచారం.
ఈ పుట్టిన రోజున ఓ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. టైటిల్ విషయంలో ఇంకా తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. ‘పెద్ది’ అనేది వర్కింగ్ టైటిల్. అయితే అది.. చరణ్ కు నచ్చలేదు. దాంతో టైటిల్ మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదో స్పోర్ట్స్ డ్రామా. సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా అంటే ఓ ఆట చుట్టూ నడుస్తుంది. అయితే ఈ సినిమాలో చాలా ఆటలు కనిపిస్తాయని, అందులో క్రికెట్ కూడా ఉంటుందని సమాచారం. క్రికెట్ సంచనలం మహేంద్రసింగ్ ధోనీ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల నైట్ ఎఫెక్ట్ లో కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. జాన్వీ కపూర్ కథానాయిక.