ఏపీ ప్రభుత్వ పెద్దలు సైలెంట్ గా చేస్తున్న పెట్టుబడుల ఆపరేషన్లో మరో విజయం లభించింది. రెవ్యూవబుల్ ఎనర్జీ రంగంలో రిలయన్స్ రూ. 65వేల కోట్లను వచ్చే ఐదేళ్లలో పెట్టుబడిగా పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. రిలయన్స్ బృందం అమరావతిలో చంద్రబాబుతో సమావేశమై ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. అంతర్గతంగా చర్చలు జరిపి నేరుగా ఎంవోయూ చూసేకున్నప్పుడే ఈ పెట్టుబడుల అంశం బయటకు తెలిసింది.
ఒక్క రోజు ముందే టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఏపీ పర్యటనకు వచ్చారు. అమరావతిలో చంద్రబాబును కలిసి టాటా పవర్ లో నలభై వేల కోట్ల పెట్టుబడులు.. హోటల్ రంగంలో ఇరవై స్టార్ హోటల్స్ నిర్మాణంపై చర్చించారు. అదే సమయంలో విశాఖలో పది వేల మందికి ఉద్యోగాలిచ్చేలా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ క్యాంపస్ ను ఏర్పాటు చేయడంపైనా చర్చించారు. ఇప్పటికే టాటా కంపెనీ విశాఖలో భవనాలను పరిశీలిస్తోంది.
ఇటీవలి కాలంలో ఏపీకి భారీ పెట్టుబడుల ప్రతిపాదనలు వస్తున్నారు. అమరావతిలోనూ పలు సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ కార్యాలయాలను అమరావతిలో ఏర్పాటు చేయనున్నాయి. ఇంకా అనేక పెట్టుబడుల ప్రతిపాదనలను ఫాలో అప్ చేస్తున్నారు. ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పని చేస్తోంది.