తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పటి నుంచి… ఇప్పటి వరకూ.. ఒక్కటంటే.. ఒక్క సర్వే కూడా… కాంగ్రెస్‌కు అనుకూలంగా.. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా రాలేదు. అసెంబ్లీని రద్దు చేసినప్పుడు… ప్రఖ్యాత మీడియా సంస్థలు చేసిన సర్వేల్లో 90 సీట్లు టీఆర్ఎస్కు వస్తాయని లెక్కలేశారు. ఆ తర్వాత మెల్లగా… సీట్లు ఓట్లు తగ్గించుకుంటూ వస్తున్నారుకానీ… ఓడిపోతుందని.. ఏ ఒక్క సర్వే సంస్థ కానీ.. ఆ సంస్థలో కొలాబరేట్ అయ్యే టీవీ చానళ్లు కానీ ప్రకటించారు. నిన్నటికి నిన్న ఇండియా టుడే కూడా… టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పారు. అయితే వీటన్నింటికంటే.. భిన్నంగా…తెలంగాణ మహాకూటమి గెలబోతున్నట్లు.. ఓ సర్వే వెలుగులోకి వచ్చింది.
నెంబర్ వన్ హిందీ న్యూస్ చానల్ ఏబీపీ – న్యూస్ సీ ఓటర్‌తో కలిసి ఓ సర్వే నిర్వహించింది. మహాకూటమికి 64 సీట్లు, టీఆర్ఎస్కు 42 సీట్లు, బీజేపీకి 4 సీట్లు , ఇతరులకు 9 స్థానాలు దక్కుతాయని సర్వేలో వెల్లడయినట్లు ప్రకటించింది. కాంగ్రెస్ కూటమికి 33.9 శాతం ఓట్లు వస్తే… టీఆర్ఎస్కు 29.4 శాతం ఓట్లు వస్తాయని.. సర్వే అంచనా వేసింది. నిజానికి ఇది సంచలనాత్మకమే. ఎందుకంటే… కేసీఆర్‌కు తిరుగులేదనుకుంటున్న సమయంలో… ఫలితం తిరగబడబోతోందని.. మొట్టమొదటిగా వచ్చిన ఓ ప్రముఖసర్వే. నిజానికి సీవోటర్ గతంలో… అదీ కూడా అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత.. టీఆర్ఎస్ గెలుస్తుందని అంచనా వేసింది.కానీ ఇప్పుడు కొద్ది రోజులుకే పరిస్థితి మారిపోయింది. ఈ మధ్యలో.. కాంగ్రెస్ పార్టీ కూటమిని చేసింది. మహాకూటమి ఏర్పడింది. అందులో టీడీపీ, టీజేఎస్, సీపీఐ ఉన్నాయి. దాంతో.. తెలంగాణ ఎన్నికల సీన్ మొత్తం మారిపోయిందనే అంచనాలు ఉన్నాయి.
నిజానికి ఇప్పటికే… రాజకీయవాతావరణం మారిన సూచనలు ఉన్నాయి కానీ.. మహాకూటమి ఇంకా సర్దుకోలేదు. సీట్లను పంచుకోలేదు. అభ్యర్థుల్ని ఖరారు చేసే దిశగానే ఉన్నాయి. అయినా.. మహాకూటమి పట్ల ప్రజలు సానుకూలతతో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. ఈ సానుకూలతను.. కూటమి ఓట్ల దాకా తీసుకెళ్తుందా.. చేతికి అంది వచ్చిన అధికారాన్ని అందుకుటుందా .. లేదా.. అన్నదే ఆసక్తికరం.