రిటైరైనా ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరరావు పూర్తి స్థాయిలో విముక్తి పొందారు. వైసీపీ హయాంలో ఆయన పదేళ్ల పాటు నరకం అనుభవించారు. తన సర్వీస్ కోల్పోయారు. ఏ పోస్టింగ్ లేకుండా చివరి పదేళ్లు ఖాళీగా గా ఉన్నారు. జీతం కూడా ఇవ్వలేదు. ఇందు కోసం ఆయనపై చాలా అభియోగాలు చేశారు. కేసులు పెట్టారు. డిస్మిస్ చేయమని సిఫారసులు చేశారు. చివరికి అన్నీ ఫేక్ అని తేలాయి. ఆయనపై అన్ని అభియోగాలను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చేసింది.
అయితే ఆయన ఏ తప్పూ చేయలేదనే వాదిస్తున్నారు. అసలు కొనని పరికరాలు కొన్నట్లు కేసులు పెట్టారు. రూ. పది లక్షలు కేంద్ర సంస్థకు ఇస్తే అవి తిరిగి వచ్చాయి. కానీ ఆ పది లక్షలు పోయాయని..కేసులు పెట్టి కోట్లు పెట్టి లాయర్లతో ఏబీవీని టార్గెట్ చేసేందుకు ఉపయోగించారు. ఆయనపై తప్పుడు పత్రాలు సృష్టించారు. గౌతం సవాంగ్ స్వయంగా ఫోర్జరీ చేశారని ఏబీవీ కూడా ఆరోపించారు. విచారణాధికారులు ప్రభుత్వ పెద్దల మెప్పును పొందేందుకు చాలా పత్రాలును పరిగణనలోకి తీసుకోలేదు.
ఇలా ఏబీవీని వేధించేందుకు ఎంతో మంది.. అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల ప్రకారం కుట్రలు చేశారు. ఏబీవీని కేసుల నుంచి విముక్తి చేయడం న్యాయం కాదు. ఆయనపై కుట్ర చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవడం న్యాయం. కానీ అలాంటి అవకాశాలు కనిపించడం లేదు. అలా చర్యలు తీసుకోవాలని ఏబీవీ కూడా ఒత్తిడి చేస్తున్నట్లుగా లేదు. కేసులు పెడతారన్న భయంతో వైసీపీ ఓడిపోగానే .. గౌతం సవాంగ్ తన ఎపీపీఎస్సీ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేసి రాష్ట్రంలో లేకుండా వెళ్లిపోయారు.