టాలీవుడ్ దృష్టి మరో రీమేక్‌పై పడింది. అదే.. ‘డ్రైవింగ్ లైసెన్స్’. మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమా ఇది. ఫృథ్వీరాజ్, సూరజ్ కథానాయకులుగా నటించారు. ఓ సినిమా స్టార్కీ, మోటార్ వెహికల్ ఇన్స్పైక్టర్కీ మధ్య జరిగే కథ ఇది. చాలా చిన్న పాయింట్‌ని పట్టుకుని, రెండు గంటల పాటు థ్రిల్లర్‌లా నడిపించాడు దర్శకుడు లాల్ జూనియర్. ఈ సినిమాపై రామ్ చరణ్ దృష్టి పడదినట్టు, వెంకటేష్‌తో కలిసి ఈ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా హక్కుల్ని రామ్ చరణ్ కొన్నట్టు కూడా చెబుతున్నారు. అయితే ఈసినిమాని చరణ్ కొనలేదని, ఈ సినిమా కొనే ఆలోచన కూడా ఆయనకు లేదని చరణ్ సన్నిహిత వర్గాలు క్లారిటీ ఇచ్చేశాయి. చరణ్ చేతిలో చాలా సినిమాలున్నాయిప్పుడు. ఆర్.ఆర్.ఆర్ ముగిసిన వెంటనే, చిరు 152వ సినిమాలో పాలు పంచుకోవాలి. ఆ వెంటనే కొరటాల శివతో ఓ సినిమా ఉండొచ్చు. `ఆర్.ఆర్.ఆర్` మల్టీస్టారర్ సినిమా కాబట్టి, కొన్నాళ్ల పాటు మరో హీరోతో తెర పంచుకోవడానికి సముఖత చూపించకపోవొచ్చు. వెంకటేష్‌కి అయితే ఈ కథ బాగుంటుంది. కానీ… మరో హీరోని వెదికిపట్టుకోవాలి. సూరజ్ పాత్ర వెంకీకి బాగా సెట్టవుతుంది. కానీ.. ఫృథ్వీరాజ్గా కనిపించేవాళ్లెవరో తేలాలి. తెలుగులో ఈ సినిమా వర్కవుట్ అయ్యే ఛాన్సులెక్కువ. మరి ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో..??