జగన్ రెడ్డి జమానాలో ఎఫ్ఐఆర్ల విప్లవం నడిచింది. నిజమైన రౌడీలు, ఖునీకోరులు హాయిగా తిరుగుతూంటే… టీడీపీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాపోస్టులు పెట్టినా వేధింపులు ఎదుర్కొన్నారు. కేసుల పాలయ్యారు. టీడీపీ అధికారంలోకి రావడంతో అందరిపై కేేసులు ఎత్తివేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
పార్టీ కోసం పని చేసి కేసుల పాలైన ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేయాలని.. కేసు వివరాలతో సహా మొత్తం డీటైల్స్ తో సిద్ధం కావాలన్నారు. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలపై నమోదైన కేసుల వివరాలను ప్రత్యేక ఫార్మాట్ లో వివరించి .. పార్టీ కార్యాలయానికి పంపించాలని సూచించారు. అలాగే వైసీపీ కార్యకర్తలు దాడులు చేసినప్పుడు .. సరిగా స్పందించని పోలీసులు, ఇతర అధికారుల సమాచారం కూడా పంపాలని ఆదేశించారు.
టీడీపీ కోసం పని చేసే ప్రతి ఒక్కరినీ వేధిచారు. పోస్టులు పెడితే చాలు రంగనాయకమ్మ అనే వృద్ధురాలిని కూడా వదలకుండా సీఐడీ నోటీసులు ఇచ్చి పిలిపించి ప్రశ్నించింది. కరోనా టైంలో విచారణకు పిలిపించి .. కరోనా అంటించి పంపించేవారు. ఇలా గంటా అనుచరుడు అయిన ఓ పెద్దాయన ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువకుడ్ని అరెస్ట్ చేసి.. గే ముద్ర వేసి అవమానించే ప్రయత్నం చేశారు. ఇలాంటి వేధింపులు లెక్కలేనన్ని. వీరందరికీ న్యాయం చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అన్ని వివరాలు వచ్చాక.. లీగల్ ప్రాసెస్‌లో కేసులన్నీ ఎత్తివేయనున్నారు.