రేణూదేశాయ్‌కి పవన్ కల్యాణ్ విడాకులు ఇచ్చాడన్న మాటే గానీ… వీరిద్దరూ టచ్‌లోనే వున్నారనేది నిర్విదాంశం. రేణుని, పిల్లల్ని కలుసుకోవడానికి అప్పుడప్పుడు పవన్ పూణే కూడా వెళ్లొస్తాడు. ఆ సందర్భంగా తీసిన ఫోటోలు కొన్ని ట్విట్టర్ లో తన అభిమానులతో పంచుకుటుంది రేణు. అంతేకాదు వీలు కుడురినప్పుడల్లా పవన్ కళ్యాణ్ పై తనకున్న ప్రేమను చాటుతూ ఉటుంది. ”ఓ పేపర్ లో విడాకులు అని రాసినంత మాత్రాన మేము అపరిచితులం కాలేం. మాకు పిల్లలు వున్నారు. విడాకులు బంధాలను దూరం చేయలేవ్”అంటూ గుర్తుచేస్తుంటుది రేణు. తాజగా మరోసారి పవన్ కళ్యాణ్ పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారామె’’. కళ్యాణ్ లాంటి నిజాయితీ వున్న మనిషిని ఎప్పుడూ చూడలేదు. ఇప్పటికీ చెబుతున్న, ఆయన నాకు గొప్ప జీవితం ఇచ్చారు. మా మధ్య కొని ప్రతికూల పరిస్థితిలు వచ్చాయి. అవి మా మధ్య దూరం పెంచినా బంధాలను వేరు చేయలేదు” అంటూ ఎప్పటిలానే కళ్యాణ్ పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచింది రేణు.
ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ నట వారసుడు అకీరానే అని చెప్పకనే చెప్పేసింది రేణూదేశాయ్. పవన్ తనయుడు అకీరా ఇప్పుడు రేణు దగ్గర పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన దగ్గర పెరుగుతున్నా, కళ్యాణ్ వారసత్వం అకీరాదే అంటోంది రేణు. అకీరాను సినిమాల్లో కి తీసుకురావాలని రేణు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టెసిన సంగతి తెల్సిందే. తను దర్శకత్వం వహించిన ‘ఇష్క్ వాలా లవ్’ చిత్రంలో అకీరాతో ఓ చిన్న రోల్ చేయించింది. ఆ రకంగా సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అయిపోయాడు అకీరా. భవిష్యత్ లో పవన్ వారసుడుగా అకీరా గ్రాండ్ ఎంట్రీకి కూడా రంగం సిద్దం చేస్తోంది రేణు. పవన్ కళ్యాణ్ తర్వాత మీకు నచ్చిన యాక్టర్ ఎవరు ? అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం వుంటే అలానే అనిపిస్తుంది.”’పవన్ కళ్యాణ్ తర్వాత నాకు నచ్చిన యాక్టర్ వున్నారు. ఆయన ఎవర కాదు . నా సినిమాలో గెస్ట్ రోల్ వేశారు. ఇంకెవరు అకీరానే’’ అంటూ ముసిమసి నవ్వులు పూయించింది రేణు. ఆమె మాటలు వింటే.. ఏదేమైనా పవన్ వారసుడిగా అకీరాను నిలబెట్టడానికి అప్పుడే గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు అనిపిస్తుంది.