అఖీరానందన్ను పవన్ కల్యాణ్ కుమారుడు అన్నందుకు రేణుదేశాయ్ సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టారు. అది చాలా కాంట్రావర్షియల్గా. పవన్ కల్యాణ్ అభిమానుల్ని కించ పరిచేలా ఉంది. సోషల్ మీడియ అన్న తర్వాత అన్నిరకాల మనుషులు ఉంటారు. వారు చేసే కామెంటలు ఏవీ సీరియస్ కావు. వాటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అకీరా విషయంలో రేణు దేశాయ్ స్పందన మాత్రం .. ఆమె నుంచి కొడుకుని దూరం చేసేస్తున్నారంతగా రియాక్ట్ అయ్యారు. ఇలా ఎందుకు రియాక్టయ్యారన్న సంగతి పక్కన పెడితే … ఇంత కాలం సైలెంట్ ఉండి ఇప్పుడే ఎందుకు వివాదాస్పదం అయ్యే కామెంట్లు చేస్తున్నారన్నది చర్చకు వస్తోంది.
ఖచ్చితంగా గత ఎన్నికలకు ముందు కూడా రేణు దేశాయ్ ఇలాంటి హడావుడి చేశారు. సాక్షి మీడియాకు ఇంటర్యూ ఇచ్చారు. తమ వ్యక్తిగత జీవితంలోని విషయాల గురించి ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ గురించి ఊహించనంతటి ఆరోపణలు చేశారు. ఆ తర్వాత .. యాంకర్ స్వప్నతో కలిసి సాక్షి మీడియా పే రోల్ లో కొన్నాళ్లు ఉన్నారని చెబుతారు. ఎన్నికల తర్వాత మళ్లీ సైలెంటయ్యారు. మళ్లీ ఎన్నికలకు వివాదాస్పద కామెంట్లతో తెరపైకి వస్తున్నారు. తెలుగు సినీ ఫ్యాన్స్ అకీరాను పవన్ కుమారుడిగానే చూస్తారు. అలా అంటే రేణు కుమారుడు కాదని అర్థం కాదుగా. ఆ విషయం ఆమెకు తెలియకు కాదని.. కావాలనే స్పందించారన్న అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది.
మరో వైపు పరకాల ప్రభాకర్ కూడా అతిగా స్పందిస్తున్నారు. ఇంత కాలం మెగా ఫ్యాన్స్ తిట్టారని.. ఇక తట్టుకోవడం కష్టమని ఎదురుతిడుతున్నానని ఆయన చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ విషయంలో ఆయన చేసింది నైతిక విలువలకు విరుద్ధం. ఆ పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే… వెళ్లిపోవచ్చు కానీ ఆ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ఆ పార్టీనే తిట్టడం… నైతికత కాదు. అప్పుడే ఆయన నైతికత కోల్పోయారు. అప్పట్నుంచి ఏ ప్రజారాజ్యం కార్యకర్త కూడా ఆయనను గౌరవంగా చూడరు. మరి ఇప్పుడే తనను తిడుతున్నారని ఆయన ఎందుకు అసభ్య పదజాలంతో ఎదురుదాడికి దిగుతున్నారన్నేది అంతకు చిక్కని అంశం.
రాజకీయాల్లో దేన్ని తక్కువ అంచనా వేయలేం . చాలా వరకూ వ్యూహాత్మకంగానే జరుగుతూ ఉంటాయి. యాధృచ్చికంగా జరిగితే చెప్పలేం కానీ.. ఇలా వ్యూహాత్మకంగా జరిగితే మాత్రం రాజకీయాన్ని తీసి పారేయలేం.