జనసేన అధినేత మాజీ భార్య రేణుదేశాయ్.. రెండో పెళ్లికి మరో అడుగు ముందుకేశారు. కాబోయే భాగస్వామితో నిశ్చితార్థ వేడుకను పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. కానీ తనకు కాబోయే భర్త ఎవరు అన్న విషయాన్ని మాత్రం రేణు దేశాయ్ బయట పెట్టలేదు. కేవలం ఉంగరాలు మార్చుకున్న చేతుల ఫోటోను మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రేణుదేశాయ్ కొద్ది రోజులుగా… తన రెండో పెళ్లికి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో దాదాపుగా ప్రతీ రోజూ.. అప్ డేట్ చేస్తున్నారు.
గతంలో రెండో పెళ్లి చేసుకోవాలని ఉందని… ప్రకటన చేసినప్పుడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నుంచి బెదిరింపులు వచ్చాయి. చేసుకోబోయే వ్యక్తిని ముక్కులుగా నరుకుతామని కూడా కొంత మంది హెచ్చరించారని… “ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే” ఇంటర్యూలో రేణుదేశాయ్ స్వయంగా చెప్పారు. ఆ భయం వల్ల కాబోయే భర్త ఐడెంటిటీని బయట పెట్టకూడదన్న ఆలోచనలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నిశ్చితార్థ వేడుక తర్వాత తనకు కొంత మంది పవన్ ఫ్యాన్స్ నుంచి సానుకూల సందేశాలు వచ్చాయని రేణుదేశాయ్ సంతోషం వ్యక్తం చేశారు. కాబోయే భర్త తనను..తన పిల్లలను బాగా చూసుకుంటారన్న ఆనందాన్ని రేణుదేశాయ్ వ్యక్తం చేశారు.
రేణుదేశాయ్ పెట్టిన సోషల్ మీడియా పోస్టులో పిల్లల ప్రస్తావన ఉంది. పిల్లలు తనతోనే ఉంటారని… అందర్నీ తన కాబోయే భర్త బాగా చూసుకుంటారని కూడా ధీమా వ్యక్తం చేశారు. అయితే.. రేణు దేశాయ్ పిల్లలు… అకిరానందన్, ఆద్య మాత్రం.. ఈ వేడుకలో లేరు. వారు ప్రస్తుతం పవన్ కల్యాణ్ వద్ద విజయవాడలో ఉన్నారు. శనివారం .. పవన్‌తో కలిసి…అమరావతిలో దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో… ప్రత్యేక పూజలు కూడా చేశారు. అంతే కాదు.. కొద్ది రోజుల కిందట..అకిరాను.. జూనియర్ పవన్ కల్యాణ్ అంటే సహించేది లేదని పవన్ ఫ్యాన్స్‌కు వార్నింగ్‌కి కూడా ఇచ్చారు. ఇప్పుడు పిల్లలు లేకుండానే నిశ్చితార్థ వేడుకను పూర్తి చేసుకున్నారు.