పవన్‌కల్యాణ్ ‘బద్రి’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి రేణూ దేశాయ్ అడుగుపెట్టారు. తెలుగులో పవన్ పక్కన, ఆయనకు జోడీగా మాత్రమే నటించారు. పవన్ సినిమాలతో కాస్ట్యూమ్ డిజైనర్‌గా మారారు. వీడియో ఎడిటర్‌గా రెండు సాంగ్స్ చేశారు. పవన్‌తో విడాకుల తరవాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. పవన్ మాజీ భార్యగా వీడ్కోలు పలికారు. తరవాత మాతృభాష మరాఠీలో నిర్మాతగా ఒక సినిమా, దర్శకురాలిగా మరో సినిమా చేశారు. త్వరలో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నారు.
ప్రముఖ హీరో సినిమాలో వదినగా నటించనున్నారని వచ్చిన వార్తలను ఖండించిన రేణూ దేశాయ్, దర్శకురాలిగా రైతు సమస్యలపై సినిమా రూపొందించనున్నట్టు స్పష్టం చేశారు. కథ, స్క్రీన్‌ప్లే పూర్తి చేసి ప్రస్తుతం డైలాగులు రాస్తున్నారు. అయితే.. షూటింగ్ మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతి తరవాత మొదలు పెడతారు. ఈలోపు పెళ్లి చేసుకోవాలనేది రేణూ దేశాయ్ ప్లాన్‌గా తెలుస్తోంది. దీనికి బలమైన కారణాలు వున్నాయట.
తెలుగు మీడియా ముందుకు ఆమె వస్తే… పవన్ కల్యాణ్ ప్రస్తావన లేకుండా ప్రశ్నలు వుండవు. సినిమా పబ్లిసిటీకి మీడియా ముందుకు రాక తప్పదు. పవన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఫేస్ చేయడం ఇష్టంలేని రేణూ దేశాయ్… త్వరగా పెళ్లి చేసుకుని పవన్ మాజీ భార్యగా కాకుండా, ఇంకొకరి శ్రీమతిగా ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నార్ట. అప్పుడు ‘కొత్త జీవితం ప్రారంభించాను. గతానికి సంబంధించిన ప్రశ్నలు వద్దు. ప్లీజ్!’ అని రిక్వెస్ట్ చేసే ఛాన్స్ వుంటుంది. మీడియా ఆమె రిక్వెస్టుని ఎంతవరకూ పరిగణలోకి తీసుకుంటుందనేది పక్కన పెడితే… పెళ్లి తరవాతే మెగాఫోన్ పట్టుకోవాలని రేణు దేశాయ్ ఫిక్స్ అయ్యార్ట.
పవన్ అన్న కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘తొలిప్రేమ’లో ఒక డైలాగ్ వుంది. ‘జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా ఎప్పుడూ మనతోనే వుంటాయి. మోయక తప్పదు’ అని. రేణూ కూడా కొన్ని విషయాలను ప్రస్తావించకూడని అనుకున్నప్పటికీ.. వాటి ప్రస్తావన వస్తూనే వుంటుంది.