రేణూదేశాయ్ రీ ఎంట్రీ ఇవ్వబోతోందా? ఆమె మేకప్ వేసుకుని మళ్లీ తెలుగు సినిమాలు చేయడానికి సిద్ధం అవుతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈమధ్య రేణు ని వెదుక్కుంటూ కొన్ని ఆఫర్లు వెళ్లాయి. కానీ తను మాత్రం సున్నితంగా తిరస్కరించింది. తనకు సినిమాలపై ధ్యాస లేదని తేల్చి చెప్పింది. ఇప్పుడు రేణు మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. తెలుగులో సినిమాలు చేయడానికి తాను సిద్ధంగానే ఉన్నట్టు, అయితే మంచి పాత్రల కోసం అన్వేషిస్తున్నట్టు సమాచారం. రేణు రెండో పెళ్లి ఇష్యూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చగా మారిన సంగతి తెలిసిందే. దానికి ముందు ట్వీట్లతో.. తరచూ టచ్లో ఉండేది రేణు. ఆ తరవాత… ట్విట్టర్కి గుడ్ బై చెప్పి – ఇలాంటి హడావుడికి దూరంగా ఉంటోంది. తన రెండో పెళ్లి తరవాత… రేణు సినిమాలు చేయడం ఖాయమని, అయితే పద్ధతైన, హుందా పాత్రల్ని ఎంచుకొంటుందని, త్వరలోనే తను ఓ సినిమాపై సంతకం చేయడం ఖాయమని రేణు సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరి రేణు ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో? ఆ సినిమాని పవన్ అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో.??