రేణూ దేశాయ్‌ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ తో బంధానికి బ్రేకప్ చెప్పాక సోషల్ మీడియా ద్వారా రేణూ ఎక్కువగానే టచ్‌లో ఉంది. రేణూ పోస్టింగులు, కామెంట్లు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాయి. నిజం చెప్పాలంటే.. పవన్ తో కలసి ఉన్నప్పటి కంటే, విడిపోయిన తరవాతే ఆమెపై మీడియా అటెన్షన్ ఎక్కువైంది. దాంతో.. సినిమా అవకాశాలూ తలుపు తట్టాయి. కాకపోతే… నటించడానికి రేణూ చాలా సందేహించింది. మంచి ప్రాజెక్టుల కోసం ఎదురు చూసింది.క్రమంగా.. తాను కోరుకున్న ప్రాజెక్టులు తన దగ్గరకు వస్తున్నాయి.
తాజాగా ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి రెడీ అయ్యింది రేణూ. ఎం.ఎస్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. డి.ఎస్. రావు నిర్మాత. ఈ వెబ్ సిరీస్‌లో రేణూదే ప్రధాన పాత్ర. ఓ మహిళ చేసే పోరాటం, అందులో భాగంగా ఆమెకు ఎదురయ్యే సమస్యల నేపథ్యంలో సాగే కథ ఇది. నిజానికి ఈ కథతో సినిమానే తీద్దామనుకున్నారు. కానీ.. ప్రస్తుత పరిస్థితులు థియేటరికల్ రిలీజ్‌కి అనుకూలంగా లేవు. అందుకే ఓటీటీ కోసం వెబ్ సిరీస్ గా మార్చేశారు. త్వరలోనే ఈవెబ్ సిరీస్ మొదలు కాబోతోందని రేణూనే అధికారికంగా ప్రకటించింది.