పవన్ కల్యాణ్ భార్యగా కంటే, మాజీ భార్యగానే ఎక్కువ గుర్తింపు, ప్రచారం సంపాదించుకుంది రేణూ దేశాయ్. నటిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగానూ తనలోని విభిన్న పార్శ్వాలను బయటపెడుతోంది. ఇటీవల కొన్ని ఆఫర్లు రేణూని వెదుక్కుంటూ వెళ్లాయి. అయితే.. ఏవో కొన్ని కారణాల వల్ల తిరస్కరించింది. అయితే ఇప్పుడు మళ్లీ రేణూకి నటనపై మనసైంది. ఎలాంటి పాత్రలకైనా తాను సిద్ధమే అని చెబుతోంది. ఆఖరికి తల్లి పాత్రలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తనది తల్లి పాత్రలు చేసే వయసు కాకపోయినా… చేస్తానంటోంది. ఇప్పుడున్న యువ కథానాయకులకు తల్లిగా నటించడానికి తనకు అభ్యంతరం లేదంటోంది. అయితే తల్లి పాత్రలని మరీ ముసలమ్మగా చూపిస్తే చేయనని, తల్లి పాత్రల్నీ స్టైల్ గా తీర్చిదిద్దగలిగే దర్శకులతో పనిచేస్తాని అంటోంది రేణు. నిజానికి తెలుగులో తల్లి పాత్రలకు మంచి డిమాండ్ ఉందిప్పుడు. అత్త, వదిన, పిన్ని.. ఈ పాత్రలకు కాస్త ఫాలోయింగ్ ఉన్న నటీమణుల కోసం దర్శక నిర్మాతలు అన్వేషిస్తున్నారు. వాళ్లందరికీ రేణూ మంచి ఛాయిస్ అనే చెప్పుకోవాలి.