కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్‌లను పార్టీ హైకమాండ్ ఎంపిక చేసింది. గురువారం నామినేషన్లకు చివరి రోజు. ఆ రోజున ఇద్దరూ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న బలాబలాల ప్రకారం రెండు కాంగ్రెస్.. ఒకటి బీఆర్ఎస్ కు దక్కుతాయి. బీఆర్ఎస్ తరపున ఎవరు పోటీ చేస్తారన్నది ఇంకా ప్రకటించలేదు. రేణుకా చౌదరి సీనియర్ నేత. ఆమె ఖమ్మం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. కానీ రాజ్యసభ స్థానం ఇచ్చారు. దీంతో ఖమ్మంలో పోటీ చేయాలనుకుంటున్న వారికి లైన్ క్లియర్ అయినట్లయింది. ఇక అనిల్ కుమార్ యావ్ద .. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు. 2014 ఎన్నికల్లో ముషిరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనిల్‌కుమార్ ఓటమి చవిచూశారు.
గత ఎన్నికల్లో ఆయన తండ్రి అంజన్‌కుమార్ యాదవ్ సైతం పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు అనిల్ కమార్ యాదవ్ సికింద్రాబాద్ సీటును ఆశిస్తున్నారు. కానీ రాజ్యసభ స్థానం ఇవ్వడంతో అక్కడ మరో నేతకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. తమకు లభించే రెండు సీట్లలో ఒకటి ఓసీలకు..ఒకటి బీసీలకు కాంగ్రెస్ పార్టీ కేటాయించింది.
బీఆర్ఎస్ కు ఓ స్థానం ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఎవరికి చాన్స్ ఇస్తారన్నదానిపై స్పష్టత లేదు. ఖాళీ అవుతున్న మూడు స్థానాలు ఆ పార్టీకి చచెందిన వారివే.