ఖమ్మంలో రేణుకా చౌదరి కార్పొరేటర్‌గా అయినా గెలుస్తారా .. ఆమెకు అమరావతితో ఏం సంబంధం అని అసెంబ్లీలో వెటకారం ఆడిన కొడాలి నానికి రేణుకా చౌదరి కౌంటర్ ఇచ్చారు. తాను వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి కొడాలి నానిపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. తాను ఎమ్మెల్యేగా ఇంతవరకు పోటీ చేయలేదు తొలిసారిగా చేస్తా! గుడివాడ నుండి గెలిచి చూపిస్తానని ప్రకటించారు. ఆమె సీరియస్‌గా అన్నారో లేకపోతే కౌంటర్ ఇవ్వడానికి అన్నారో కానీ పోటీ అంటూ జరిగితే ఎలా ఉంటుందా అన్న చర్చ ప్రారంభమైంది.
ఏపీకి కాంగ్రెస్‌లో బలం లేదు. కానీ రేణుకాచౌదరిపై కొడాలి నాని విమర్శలు చేశారు కాబట్టి ఆమె నేరుగా ఆయనపై పోటీ జరిగితే అది వ్యక్తిగత పోరుగా మారే అవకాశం ఉంది. అదే జరిగితే.. రాజకీయం మారిపోతుంది. రేణుకా చౌదరి ఫైర్ బ్రాండ్ లీడర్. కొడాలి నాని వి మాటలే. ఆమె చేతల్లో చూపిస్తారు. గుడివాడలో ఆమె కొడాలి నానికి వ్యతిరేకంగా రంగంలోకి దిగితే.. ఆయనను వ్యతిరేకించేవారు అంతా పోలరైజ్ అయ్యే చాన్స్ ఉంది. అప్పుడు పార్టీలు ఉండవు. గతంలో పలుమార్లు వ్యక్తిగత పోటీలు జరిగినప్పటి పరిస్థితుల్ని పరిశీలిస్తే అదే అర్థమవుతుంది.
రేణుకా చౌదరి ఖమ్మం నుంచి పార్లమెంట్‌కు పోటీ చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఆమె కూడా ఇలా వ్యక్తిగత పోటీ ఉండేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీలే ప్రాదాన్యం అయితే రేణుకా చౌదరికి ఇబ్బంది తప్పదు. నిజంగా ఆమెకు ఆ ఆలోచన ఉందో లేదో కానీ అమరావతి ఉద్యమంలో ఆమె సపోర్ట్ అవసరమైనప్పుడల్లా కనిపిస్తున్నారు. రేణుకా చౌదరి ప్రకటనపై కొడాలినాని స్పందిస్తే.. ఈ ఇష్యూ పెద్దది అవుతుంది. ఖచ్చితంగా గుడివాడలో కొడాలి వర్సెస్ రేణుక అన్నట్లుగా మారుతుంది.