ఇంగ్లిష్ న్యూస్ చానల్స్ చూస్తున్న వారిలో సగం మంది మా టీవీ చానలే చూస్తున్నారని ఆర్నాబ్ గోస్వామికి చెందిన రిపబ్లిక్ టీవీ ఘనంగా ప్రకటించుకుంది. సాక్ష్యంగా బార్క్ రేటింగ్స్‌ను జత చేసింది. అయితే.. ఇప్పుడే అసలు ట్వస్ట్ వెలుగులోకి వచ్చింది. రేటింగ్స్‌ను ట్యాంపర్ చేస్తున్నారంటూ.. బార్క్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబై పోలీసులు .., రిపబ్లిక్ టీవీ.. సుశాంత్ సింగ్ కేసులో విచారణ చేస్తున్న దాని కన్న వేగంగా పరిశోధించి… రిపబ్లిక్ టీవీవి మొత్తం ఫేక్ రేటింగ్స్ అని తేల్చేశారు. అంతే కాదు.. ఈ టాంపరింగ్‌కు పాల్పడిన వారిపై కేసులు పెట్టేశారు.
రిపబ్లిక్ టీవీకి చెందిన ముషులు… టీవీ మీటర్ రీడింగ్ ఉన్న ఇళ్లను గుర్తించి.. డబ్బులిచ్చి, తమ ఛానల్ మాత్రమే చూడాలని మీటర్స్‌ను అమర్చి అక్రమంగా రేటింగ్స్ పెంచుకుంటున్నారు. రిపబ్లిక్ టీవీతో పాటు మరో రెండు మరాఠీ చానళ్లు ఈ అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. దీనిలో బార్క్ మాజీ ఉద్యోగులతో పాటు మరికొంత మంది ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. స్కాంతో సంబంధముందని అనుమానిస్తున్న ఇద్దరు మరాఠీ టీవీ యజమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొంతమందికి నోటీసులు ఇచ్చారు.
ప్రస్తుతం ఈ స్కాం ఆర్నాబ్ గోస్వామి చుట్టూ తిరుగుతోంది. ఆయన ఈ స్కాంలో పాత్రధారి అని పోలీసులు అనుమానిస్తున్నారు. రేపో మాపో ఆయనకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ రేటింగ్స్ స్కాం బయటకు రావడానికి ఆర్నాబ్ గోస్వామి..మహారాష్ట్ర ప్రభుత్వంపై కొద్ది రోజులుగా విస్తృతంగా కథనాలు ప్రసారం చేయడమే కారణంగా అనుమానిస్తున్నారు. గతంలో ఆయన చానల్ లావాదేవీలకు సంబంధించి కొన్నాళ్లు విచారణకు పిలిచారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లిన ఆర్నాబ్ రిలీఫ్ పొందారు. బార్క్ విషయంలో మాత్రం.. ఆయన బయటపడటం కష్టమన్న ప్రచారం జరుగుతోంది.