తెలంగాణలో షర్మిల పార్టీలోకి పూర్తి స్థాయిలో చేరికలు ప్రారంభమవక ముందే రాజీనామాలు ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ షర్మిల పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లుగా ప్రకటించారు. అంతకు ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాను రాను తీసికట్టుగా మారుతున్న సమయంలో షర్మిల పార్టీ ఆహ్వానం మేరకు లోటస్పాండ్లో పార్టీలో చేరారు. అయితే ఆమె అక్కడ ఇమడలేకపోయారు. ఇందిరాపార్క్ వద్ద షర్మిల మొదటి సారి నిరుద్యోగ దీక్ష చేసిన సమయంలో స్టేజీ మీదే అందరి ముందు గాడిద అని తిట్టిన ఘటన సంచలనం అయింది.
ఆ వీడియో కూడా వైరల్ అయింది. ఆ ఘటన తర్వాత ఇందిరా శోభన్ మనసు నొచ్చుకున్నట్లుగా చెబుతున్నారు. అక్కడకు వెళ్లి మాటలు పడాల్సిన అవసరం ఏమిటని రేవంత్ రెడ్డి సైన్యం పేరుతో సోషల్ మీడియాలో ఆమెపై భారీగా ప్రచారం చేశారు. అప్పుడు ఆమె కూడాకౌంటర్ ఇచ్చారు. మాట పడిన తనకు కాకుండా మీరెందుకు బాధపడుతున్నామని విమర్శలు చేశారు. ఆవిర్భావ సభలో ఆమె వేదికపై నుంచి తన ఫోన్ పోయిందని .. తెచ్చివ్వాలని అడగారు.
దానిపైనా షర్మిల ఆమెకు చీవాట్లు పెట్టినట్లుగా తెలుస్ోతంది. ఈ పరిణామాలన్నింటితో ఆమె ఇక షర్మిల పార్టీలో ఇమడలేనని భావించి పార్టీకి గుడ్ బై చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. అభిమానులు, శ్రేయోభిలాషులు, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు నేను ఈ పార్టీకీ రాజీనామా చేశానని ప్రకటించారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అవడం.. కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ రావడంతో ఆమె మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది