ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ అధికారులను ఇష్టారీతిన బదిలీ చేయడంపై… చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు..మాజీ అధికారులను బాధించాయట. జగన్ అక్రమాస్తుల కేసులో ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను చీఫ్ సెక్రటరీగా నియమించడంపై… చంద్రబాబు..విమర్శలు చేశారు. దానిపై..నొచ్చుకున్న మాజీ అధికారులు.. మూడు రోజులుగా.. వరుసగా..చంద్రబాబు మాటలను ఖండిస్తూప్రకటనలు విడుదల చేస్తున్నారు. ఓ పది మంది మాజీ ఐఏఎస్ అధికారుల పేరుతో..మూడు రోజుల కిందట ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ రోజు నేరుగా.. గవర్నర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ బృందంలో..కల్లాం అజయ్ రెడ్డి, ఐవైఆర్ కృష్ణారావులు కూడా ఉన్నారు. ఏపీ సీఎస్‌పై చంద్రబాబు ఆరోపణలు సరికాదు ఈ మాజీ అధికారుల బృందానికి నేతృత్వం వహించిన గోపాల్‌రావు అనే ఐఏఎస్ అధికారి చెప్పుకొచ్చారు. ఎన్నికల అధికారి, సీఎస్‌పై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని.. రాజకీయ లబ్ది కోసం అధికారులపై దుష్ప్రచారం చేయడం తగదని వ్యాఖ్యానించారు.
తాము మా ఆత్మప్రభోదానుసారమే పనిచేస్తామని … కాము నిజాయితీగా పనిచేయడం వల్లే వ్యవస్థ సక్రమంగా ఉందన్నారు. తమ మా వెనుక ఎలాంటి రాజకీయ పార్టీ లేదని గోపాల్‌రావు చెప్పుకొచ్చారు కానీ.. ఆయన వెంట… ఐవైఆర్ కృష్ణారావు, కల్లాం అజేయరెడ్డి ఉన్నారు. కొద్ది రోజులుగా.. వారిద్దరూ.. వైసీపీ అనుకూలంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబుపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల ఐవైఆర్ బీజేపీలో చేరారు. కల్లాం అజేయరెడ్డి మాత్రం వైసీపీలో అధికారికంగా చేరలేదు.కానీ ఆ పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు.ఎన్నికల సంఘం ఇష్టారీతిన.. బదిలీలు చేయడం కారణాలు చెప్పకపోవడంపై చంద్రబాబు ఈసీపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో సీఎస్ నియామకమే… వివాదాస్పదం అయింది.
ఆరోపణలున్న సీఎస్‌ను.. నియమించడమే వివాదాస్పదం అయితే…ఆయనను సమర్థిస్తూ.. చంద్రబాబు ఏవోవ్యాఖ్యలు చేశారంటూ…మాజీ ఐఏఎస్‌ల పేరుతో కొంత మంది హడావుడి చేయడం… రాజకీయవర్గాలను కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చంద్రబాబు ఏమన్నారో చెప్పకుండా.. ఏదో అన్నారంటూ..వీరు ప్రెస్ నోట్లు, ఫిర్యాదులు చేయడమే ఈ ఆశ్చర్యానికి కారణం. ఎల్వీ సుబ్రహ్మాణ్యం జగన్ అక్రమాస్తులకే సులో సహ నిందితుడిగా ఉన్నారని చంద్రబాబు ఉన్నారు. అది నిజమే.. ఆరోపణ కాదు. అయినప్పటికీ.. చంద్రబాబుపై ఫిర్యాదులు చేస్తూ.. ఈ మాజీ ఐఏఎస్ అధికారులు హడావుడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.