దర్శకుడు బోయపాటి శ్రీను కొత్త సినిమా ఖరారైయింది. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నారు. ‘స్కంద’ లాంటి పరాజయం తర్వాత బోయపాటికి దారెటనే చర్చ ఫిల్మ్ సర్కిల్స్ లో జరిగింది. అయితే ఇప్పుడు గీత ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ లోనే ఆయన సినిమా ఓకే అయ్యింది. దీనిపై అధికారిక ప్రకటన కూడా బయటికి వచ్చింది. అయితే బ్యానర్ ఓకే అయ్యింది కానీ హీరో ఎవరనే క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు. అల్లు అర్జున్ తో బోయపాటి ఓ సినిమా చేస్తారనే కథనాలు వినిపించాయి. గతంలో సరైనోడు లాంటి సక్సెస్ ని అందుకున్న కాంబో ఇది. ఇప్పుడు గీతా ఆర్ట్స్ నిర్మాణంలో బోయపాటి సినిమా ఓకే అవ్వడంతో..ఆ సినిమా ఇదే అనడానికి మరింత బలం చేకూరింది. హీరో ఎవరనేదానిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలవడనుంది.