ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్కు సహకరిస్తున్న అధికారుల పేర్లను రెడ్ బుక్లో రాసుకున్నామని .. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని రేవంత్ రెడ్డి హెచ్చరిస్తూ ఉండేవారు. ఎన్నికల ప్రచారంలో కూడా అదే చెప్పారు. అందుకే రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా మంది కీలక పొజిషన్లలో ఉన్న అధికారులు రేవంత్ ను కలిసేందుకు మొహమాటపడ్డారు. వారంతా బీఆర్ఎస్ తో ఓపెన్ గా కలిసి పనిచేశారు. ప్రతిపక్ష నేతలు.. ముఖ్యంగా రేవంత్ రెడ్డిపై కూడా వేధింపులకు పాల్పడ్డారు. ఇప్పుడు వారంతా కంగారు పడుతున్నారు.
స్మితా సభర్వాల్, జయేష్ రంజన్, అర్వింద్ కుమార్ వంటి అధికారులు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ ను కలవడానికి సంకోచిస్తున్నారు. సంప్రదాయానికైనా వచ్చి అభినందనలు చెప్పలేకపోయారు. కానీ రేవంత్ రెడ్డి అలాంటి అధికారులందరికీ భరోసా ఇస్తున్నారు. అధికారుల హంటింగ్ ఉండదని మీడియా చిట్ చాట్లో చెప్పుకొచ్చారు. అయితే బదిలీలు మాత్రమే ఉంటాయన్నారు. ఆ బదిలీలల్లో కూడా పైరవీలు ఉండవని స్పష్టం చేశారు. గ్రేటర్ పరిధిలో కమిషనర్లుగా నియమితులైన వారిలో ఒక్కరు కూడా పోస్టింగ్ కోసం తనను కలవలేదన్నారు. రేవంత్ రెడ్డి మాటలు.. బీఆర్ఎస్ తో కలిసి పని చేసిన వారికి కాస్త ధైర్యం ఇస్తున్నాయని అనుకోవచ్చు. ఏపీలో అధికారుల్ని.. ఎలా ఉపయోగించుకున్నారో.. వారిలో వారిైప కేసులు పెట్టడానికి తప్పుడు స్టేట్ మెంట్లు కూడా ఎలా ఇప్పించుకున్నారో తెలంగాణ ఐఏఎస్ అధికారులు కూడా కథలు కథలుగా చెప్పుకుటున్నారు.
అక్కడ ప్రభుత్వం మాత్రం నిండా మునిగిపోయేవారు ఉన్నారని.. కానీ ఇక్కడ మాత్రం అధికారుల హంటింగ్ ఉండదని నేరుగా సీఎం చెప్పడంతో రిలీఫ్ ఫీలవుతున్నారు. రెడ్ బుక్ ను రేవంత్ రెడ్డి లోపల పెట్టేసినట్లేనని నమ్మకంగా ఉన్నారు.