తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి .. తన సొంత గ్రామం కొండారెడ్డి పల్లెను ప్రత్యేకంగా నిలపాలనుకుంటున్నారు. అందులో భాగంగా టోటల్ సోలార్ గ్రామంగా మార్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మోడల్ సోలార్ విలేజ్ గా చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధిచి అధికారులు రంగంలో కి దిగారు. కొండారెడ్డి పల్లికి టీజీఎస్పీడీఎస్ మేనేజింగ్ డైరక్టర్ కూడా వెళ్లారు. ఇతర ఉన్నతాధికారులంతా వెళ్లి.. సోలార్ పవర్ ఫల్ చేయడానికి కావాల్సిన సౌకర్యాలపై చర్చించారు.
కొండారెడ్డి పల్లె కాస్త చిన్నదే. గ్రామంలో దాదాపు 499 గృహ వినియోగదారులు ఉన్నారు. అలాగే 66 వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. మరో 867 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు. మొత్తం 1451 వినియోగదారులు వున్నారు. వీరందరికీ వంద శాతం సబ్సిడీతో సోలార్ సౌకర్యం ఏర్పాటు చేస్తారు. ఇందు కోసం ఉన్నతాధికారులు గ్రామం మొత్తం పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడారు. గ్రామానికి అవసరమైన సౌర విద్యుత్ కెపాసిటీని అంచనా వేసి తదుపరి చర్యలు తీసుకుంటారు.
ముందుగా కొండారెడ్డి పల్లెను సోలార్ పవర్ తో నింపేసిన తర్వాత పైలట్ ప్రాజెక్టుగా ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేసే ఆలోచనలో ఉన్నారు. ఇలా చేయడం వల్ల కరెంట్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. పైగా అదనపు కరెంట్ ఏమైనా ఉంటే.. అది ప్రభుత్వ గ్రిడ్ కు చేరుతుంది.