చంద్రబాబు గేమ్ ఛేంజర్ అంటూ.. గోదావరి నీటిని బకనచర్లకు తరలించేందుకు ప్రాజెక్టులను ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజాగా ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా వరద జలాల ఆధారంగా బనకచర్ల నిర్మిస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయాన్ని అధికారులు రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు వివరించారు. దీంతో సీఎం రేవంత్ తక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ అభ్యంతరాలను తెలియజేయాలని ఆదేశించారు.
అదొక్కటే కాదు పోలవరం విషయంలోనూ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా తెలంగాణ రాష్ట్రంపై పడే ప్రభావాన్ని హైదరాబాద్ ఐఐటీకి చెందిన బృందంతో అధ్యయనం చేయించాలని ఆదేశించారు. ఐఐటీ బృందంతో సమన్వయం కోసం ప్రత్యేక అధికారిని నియమించి నెల రోజుల్లో సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయించాలన్నారు.ఈ సమీక్షలో జగన్ రెడ్డి హయాంలో కీలక అధికారిగా పని చేసి ప్రస్తుతం తెలంగాణ నీటి పారుదల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ కూడా పాల్గొన్నారు.
పోలవరం నిర్మాణంతో భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయానికి ఏర్పడే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయాలని ర.. 2022లో 27 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైందని అధికారులుతెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాయాలని రేవంత్ ఆదేశించారు.