హోంశాఖ తన వద్దే ఉందని అల్లు అర్జున్ కేసు గురించి తనకు మొత్తం తెలుసని. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఓ హిందీ చానల్ ఇంటర్యూకు ఢిల్లీలో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అరెస్టుపై స్పందించారు. రాజ్యాంగం ఉంది దానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుందని అర్జున్ కేసులో కూడా అంతేనని స్పష్టం చేశారు. అక్కడ మహిళ చనిపోయింది, ఆమె కొడుకు ఇంకా జీవన్మరణ సమస్యతో పోరాడుతున్నాడని దానికి బాధ్యులెవరని ప్రశ్నించారు. జనం ప్రాణాలు పోయినా కేసు పెట్టొద్దా అని ప్రశ్నించారు.
కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే ఎటువంటి సమస్య ఉండకపోయేదని.. కానీ కారులోంచి బయటికి వచ్చి చేతులుపి హడావిడి చేశారని.. దాంతో జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు కంట్రోల్ కాలేదన్నారు. అందుకే అల్లు అర్జున్ ను ఈ కేసులో A11 గా పోలీసులు పెట్టారన్నారు. వాళ్లు ప్రత్యేకంగా దేశం కోసం చేసింది ఏం లేదని సినిమాలు తీశారు.. సంపాదించుకున్నారని అన్నారు. సరిహద్దుల్లో యుద్ధాలు చేసి విజయాలు తెచ్చారా అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి తన హయాంలో చట్టం ఎంత నిష్పక్షిపాతంగా పని చేస్తుందో చెప్పడానికి ఈ కేసునే ఉదాహరణగా చెప్పారు. నాకు చిన్నప్పటినుంచి అల్లు అర్జున్ తెలుసు, అతనికి తాను తెలుసన్నారు. అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ నేత అని గుర్తు చేశారు. అల్లు అర్జున్ కు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేత .. నాకు బంధువు కూడా అని తిలెపారు. అల్లు అర్జున్ భార్య మాకు బంధువని.. స్పష్టం చేశారు. అయితే చనిపోయిన మహిళ కొడుకు ఇంకా కోమాలో ఉన్నాడని దానికి బాధ్యుల్ని వదిలి పెట్టాలా అని ప్రశ్నించారు.
తనకు ఎవరూ ఫేవరేట్ హీరోలు లేరన్నారు. ఇప్పుడు నేనే స్టార్‌ను నాకే ఫాన్స్ ఉంటారు ఉండాలి కూడా అని సరదాగా వ్యాఖ్యానించారు.