కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనల స్పూర్తితోనే చెరువుల ఆక్రమణలపై తమ ప్రభుత్వం యుద్ధం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గచ్చిబౌలిలో హరే కృష్ణ హెరిటేజ్ టవర్ శంఖుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అక్రమ నిర్మాణాలను వదిలేస్తే తాను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్లేనని రేవంత్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లేక్ సిటీ. HYDను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తు చేశారు. భవిష్యత్ తరాలు బాగుండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఎవరు ఎన్ని ఒత్తిడులు తెచ్చినా చెరువుల ఆక్రమణదారుల భరతం పడతాంమని స్పష్టం చేశారు. ధర్మాన్ని కాపాడాలన్న శ్రీకృష్ణుడి బోధనల స్ఫూర్తిగా మా ప్రభుత్వం ధర్మంవైపు నిలబడుతుందిని ధీమా వ్యక్తం చేశారు.
ఎంత ఒత్తిడి వచ్చినా.. మిత్రులకు ఫాంహౌస్ లు ఉన్నా చెరువుల్లో అక్రమ నిర్మాణాలను వదిలే ప్రశ్నే లేదన్నారు రాయకీయం కోసమో, నాయకులపై కక్షతోనో చేయడం లేదని అక్రమ కట్టడాల కూల్చివేతలకు అందరూ సహకరించాలని కోరారు. రేవంత్ మాటలు ప్రకారం చూస్తూంటే త్వరలో .. కొంత మంది కాంగ్రెస్ నేతల ఆక్రమణలు కూడా కూల్చివేసే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.