టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడే.. మేగ్నటిక్, గ్లోబరీనా సంస్థలు.. ఇంటర్ బోర్డు కాంట్రాక్టులు దక్కించుకున్నాయని… తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ సంస్థలు కేటీఆర్ తనకు తెలియదనడం సిగ్గుచేటని మండిపడ్డారు.ఎంసెట్ పేపర్ లీకేజీ.. ఇంటర్ బోర్డు అవకతవకలు..రెండింటికీ.. ఈ సాఫ్ట్ వేర్ కంపెనీలకు సంబంధం ఉందన్నారు. ఎంసెట్ పేపర్ లీకేజ్‌పై మేగ్నటిక్ సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదని… రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. గ్లోబరీనా అనేది మాగ్నటిక్ సంస్థ కు చెందినదని… మాగ్నటిక్ సంస్థను ఎస్ఎస్సీ, ఇంటర్ బోర్డు నిషేధించాయని ..రికార్డులు బయట పెట్టారు.
పేరు మాత్రమే వేరు గ్లోబరీనా, మాగ్నటిక్ సంస్థలు వేర్వేరులు అని..రెండూ కలిసే పనిచేశాయన్నారు. కార్పోరేట్ కాలేజీలకు మేలు చేసేందుకే గ్లోబరీనా సంస్థ అక్రమాలకు పాల్పడిందని.. రేవంత్ రెడ్డి కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. మాగ్నటిక్ సంస్థ, గ్లోబరీనా సంస్థ రెండు కలిసి కాకనాడ జేఎన్టీయూలో మోసాలకు పాల్పడ్డాయన్నారు. దీనిపై కేసులుకూడా ఉన్నాయని గుర్తు చేశారు. కేటీఆర్‌కు మాగ్నెటిక్ ఇన్ఫోటెక్ సంస్థ యజమాని స్నేహితుడేనన్నారు. ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్… పరీక్షల బాధ్యతలు చూసినప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. ఎంసెట్ పేపర్ లీకేజీ కేసులో… ఇద్దరు ప్రధాన ముద్దాయిలు అనుమానాస్పద మృతి చెందారని…కేసు ముందుకు పోకుండా ప్రభుత్వం నీరుగార్చిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎంసెట్ లీకేజీ కేసులో…మాగ్నెటిక్ ఇన్ఫోటెక్ సంస్థ ఎండీని ఎందుకు విచారించలేదన్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ..కొన్నాళ్లుగా.. రాజకీయపరమైన ప్రెస్ మీట్లకు దూరంగా ఉంటున్నారు. కానీ ఇంటర్ బోర్డు విషయంలో మాత్రం..దూకుడుగా పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు మరో సారి అదే తరహా దూకుడుతో…మీడియా ముందుకు వచ్చారు. ఈ పోరాటాన్ని రేవంత్ రెడ్డి మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.