కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని.. చీకట్లు ముసురుకుంటాయని .. .. కాంగ్రెస్ కావాలా కరెంట్ కావాలా అని.. బీఆర్ఎస్ అగ్రనేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంపై రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు తెలంగాణ ఏర్పడిన తరవాత ప్రత్యేకంగా ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి కి ప్లాంట్లు నిర్మించలేదని అవసరమైనదంతా బయటకొంటున్నారని లెక్కలు చెప్పారు. ఎక్కడ్నుంచి కొంటున్నారంటే… కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చత్తీస్ ఘడ్ నుంచి అని రేవంత్ చెబుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చత్తీస్ ఘడ్ నుంచే.. తెలంగాణ కరెంట్ కొని.. రైతులకు ఎడెనిమిది గంటలు ఇస్తోందని.. కానీ ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. కాగ్రెస్ ప్రభుత్వం కరెంట్ అమ్మకపోతే… బీఆర్ఎస్ ఏడికెళ్లి తెచ్చి ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో చత్తీస్ ఘడ్ నుంచి కరెంట్ కొనుగోలుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రత్యేకంగా ట్రాన్స్ మిషన్ లైన్లు కూడా ఇందు కోసం వేశారు. ఆ ఒప్పంద ప్రకారం పెద్ద ఎత్తున కరెంట్ తెలంగాణకు లభిస్తోంది.
ఇదే విషయన్ని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని గందరగోళ పరిచి .. ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ వస్తే ఇరవై నాలుగు గంటలు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని రేవంత్ చెబుతున్నారు. తాము వస్తే.. ముందుగా పీకేది.. కేసీఆర్ కుటుబం పవర్నేనని సెటైర్ కూడా వేస్తున్నారు.