ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరుగుతోన్న ఏఐసీసీ సమావేశాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనీయబోనంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో కమలం పార్టీ మరింత విస్తరిస్తోంది. సరైన నాయకత్వమే బీజేపీకి ఉండి ఉంటే , బీఆర్ఎస్ ప్లేసులో బీజేపీ ఎప్పుడో చేరి ఉండేది. అయినా , బీజేపీని తక్కువ చేసి చూడలేం.
రేవంత్ రెడ్డి దగ్గర ఎలాంటి స్ట్రాటజీ ఉందో కానీ , బీజేపీని తెలంగాణలో అడుగు పెట్టనివ్వనని తెగేసి చెప్పారు. గాంధీ , సర్దార్ పుట్టిన గడ్డపై సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగాయని, ఇక్కడి సమావేశాల స్పూర్తితో తిరిగి తెలంగాణకు వెళ్లి బీజేపీని ఖతం చేయడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. తెలంగాణలో బీజేపీ అడుగు పెట్టడం కాదు… గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించిందన్నది ఓపెన్ సీక్రెట్ . ఆ పార్టీ వ్యూహాకర్తల సూచనలతో కమలం మరింత బలపడుతుంది.
రేవంత్ మాత్రం బీజేపీని తెలంగాణను తాకనివ్వని , బీజేపీని లైట్ అనేశారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఊహించని విధంగా మ్యాజిక్ చేసింది. వాటిని పార్టీ భవితవ్యానికి ముడిపెట్టి చూడలేమని రేవంత్ అనుకోవచ్చు. కానీ, రాష్ట్రంలో ఆ పార్టీకి ఓటు బ్యాంక్ పెరిగింది. అది అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల్లో ప్రస్ఫుటమైంది. అయినప్పటికీ , బీజేపీని సిల్లీగా ట్రీట్ చేయడంపై.. కమలాన్ని లైట్ తీసుకుంటే రేవంత్ కు ప్రమాదమేనని అంటున్నారు.