అధికారం ఏ ముహూర్తంలో కోల్పోయారో కానీ బీఆర్ఎస్ కు అన్నీ ఎదురుదెబ్బలే. ఏ ఒక్కటీ కలిసి రావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ జీరోకే పరిమితమై బలహీనం అయిన బీఆర్ఎస్..ఇప్పుడు ప్రత్యర్థులపై కౌంటర్ ఎటాక్ చేసి పుంజుకోవాలని చూస్తున్నా ఆ ప్రయత్నాలేవీ ఫలించడం లేదు.
పార్టీని కొంతమంది ఎమ్మెల్యేలు వీడటంతో..అసెంబ్లీ సమావేశాల సందర్బంగా సర్కార్ ను కార్నర్ చేసి అప్పర్ హ్యాండ్ సాధించి బీఆర్ఎస్ సత్తా చాటాలని అనుకున్నారు. ఇందుకోసం అసెంబ్లీలో సీనియర్ సభ్యులైన హరీష్ , కేటీఆర్ , తాజాగా జగదీశ్వర్ రెడ్డిలు మాత్రమే ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతున్నారు. రేవంత్ ను నేరుగా ఎదుర్కోలేక పర్సనల్ ఎటాక్ చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
Also Read : చర్లపల్లి చుట్టూ చక్కర్లుకొడుతున్న అసెంబ్లీ
ఈ క్రమంలోనే హరీష్ , చంద్రబాబును రేవంత్ గురువు అని..తెలంగాణ వ్యతిరేకి అని గత విషయాలతో రేవంత్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. కానీ, రేవంత్ మాత్రం తగ్గేదేలే అంటూ పలు విషయాలను ఉదహరిస్తూ బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇస్తున్నారు.
బీఆర్ఎస్ నేతలు ఒకటి అంటే..రేవంత్ నాలుగు కౌంటర్లు ఇస్తూ వారి నోళ్లు మూయిస్తున్నారు. చర్లపల్లి జైలు జీవితం రేవంత్ కు గుర్తుస్తోందని జగదీశ్వర్ రెడ్డి అనగానే.. సూర్యాపేట రైస్ మిల్లర్లు చెట్టుకు కట్టేసిందో ఎవరినో అందరికీ తెలుసునంటూ రేవంత్ కౌంటర్ ఇచ్చి జగదీశ్వర్ రెడ్డి నోరు మూయించారు.
దీంతో బీఆర్ఎస్ నేతలు ఒకటి అని..నాలుగు అనిపించుకోవాల్సి వస్తోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అసెంబ్లీలో పైచేయి సాధించాలని ఎంత ప్రయత్నించినా అవేవీ వర్కవుట్ కాకపోవటంతో బీఆర్ఎస్ శ్రేణులు నిట్టూరుస్తున్నాయి.