ఓ వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారిపోయారు. మరో వైపు అన్న కూడా అదే బాటలో ఉన్నారని.. రేవంత్‌ను బూచిగా చూపి వెళ్లిపోయేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. వెంకటరెడ్డి తమతో టచ్‌లో ఉన్నాడని నేరుగా ప్రకటించిన బండి సంజయ్‌ను వెంకటరెడ్డి పల్లెత్తు మాట అనకపోగా.. పార్టీ మారుతారా అని అడుగుతూంటే.. ఖండించేందుకు కూడా సిద్ధపడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి మాత్రం వ్యూహాత్మకంగా స్పందిస్తున్నారు. తనను టార్గెట్ చేస్తున్నా.. ప్రజాస్వామ్య యుతంగా స్పందిస్తున్నారు.
“మీరు” అని రేవంత్ రెడ్డి విమర్శించారని ఆ పదం వెనక్కి తీసుకోవాలని వెంకటరెడ్డి చేసిన డిమాండ్‌పై రేవంత్ రెడ్డి పొల్ైట్గా స్పందించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వేరే.. రాజగోపాల్‌రెడ్డి వేరు.. వెంకట్ రెడ్డి మా కుటుంబ సభ్యుడని రేవంత్ ప్రకటించారు. రాజ్ గోపాల్ రెడ్డి ద్రోహి అ్నారు. వెంకట్ రెడ్డికి వివరణ ఇస్తున్నా.. రాజగోపాల్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు వెంకట్ రెడ్డికి సంబంధంలేదు.. వెంకన్న మా వాడేనని ప్రకటించారు. రేవంత్ రెడ్డి ఇలాంటి స్పందన ఇవ్వడంతో ఇప్పుడు కోమటిరెడ్డి ఆవేశానికి అర్థం లేకుండా పోయింది. రేవంత్ ను రెచ్చగొట్టాలని అనుకుంటున్నారు కానీ రేవంత్ పార్టీలో ఉన్న సీనియర్లు అందరితో పొలైట్‌గా వ్యవహరిస్తున్నారు.
కారణం ఏదైనా రేవంత్ ప్రవర్తన తప్పు పట్టడానికి లేకుండా పోయింది. కానీ సీనియర్ల వ్యవహారం మాత్రం తేడాగా ఉంది. వారిని పార్టీని నమ్ముకోకుండా అమ్ముకుంటున్నారని.. కోవర్టులుగా పని చేస్తూ.. పార్టీకి ద్రోహం చేస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. కారణం ఏదైనా ఇప్పుడు కోమటిరెడ్డి మాత్రం ఎలా స్పందించినా బ్యాడ్ అయిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన పై రేవంత్ ఎంత సానుకూలత చూపిస్తున్నా.. ఆయన మాత్రం రేవంత్‌ను టార్గెట్ చేస్తూండటంతో.. అందరికీ రేవంత్ మీదే సానుభూతి వస్తోంది.