పదేళ్ల తర్వాత వచ్చిన అధికారంలో భాగం అవ్వాలంటే… కొన్ని లక్ష్యాలు సాధించాలని క్యాడర్ కు రేవంత్ రెడ్డిపోటీ పెడుతున్నారు. వచ్చే జూన్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని అందులో పార్టీ తరపున అభ్యర్థిత్వాలు దక్కించుకోవాలంటే తమ తమ ప్రాంతంలోకాంగ్రెస్ కు మెజార్టీ చూపించాల్సిందేనని అంటున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బూత్‌లో మోజార్టీని బట్టి టిక్కెట్లు ఇస్తామని నిర్ణయించారు.
అదే సమయంలో రేవంత్ రెడ్డి పథకాలను ప్రతి ఇంటికి చేర్చేందుకు ఇందిరమ్మ కమిటీలను కాంగ్రెస్ క్యాడర్ తో ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీల్లో ప్రతి సభ్యుడికి రూ. 6వేల గౌరవ వేతనం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ రకంగా వాలంటీర్లు లాగే. గతంలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ఉన్నాయి. తర్వాత ప్రతి 35 ఇళ్లకు ఒకరుచొప్పున సాధికార మిత్రల్ని నియమించారు. కానీ వాలంటీర్ల అంత ఫోర్స్ గా కుటుంబాలను బెదిరించేలా వ్యవస్థని తీర్చిదిద్దలేదు.
ఇప్పుడు రేవంత్ ఇందిరమ్మ కమిటీలను ఎలా ఉపయోగించుకుంటారో తెలియదు కానీ.. వాటిని మాత్రం… క్రియాశీలం చేయాలనుకుంటున్నారు. పథకాలను ప్రతి ఇంటికి చేర్చి.. రాజకీయంగా లబ్ది పొందాలనే ఆలోచన అన్ని పార్టీలకూ ఉంటుంది. కానీ ఇలా ఏర్పాటు చేసే వ్యవస్థలే ఆయా పార్టీలకు మైనస్ గా మారుతున్నాయి.