త్వరలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరై సింహగర్జన చేస్తారని, రేవంత్ సర్కార్ కు సభలో చుక్కలు చూపిస్తారని బీఆర్ఎస్ భారీగా ఆశలు పెట్టుకుంది.100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందిందని, కేసీఆర్ వాగ్ధాటితో సభలో వార్ వన్ సైడ్ ఉంటుందని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించేలా ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలైన హామీలు, పెండింగ్ హామీల అమలు కోసం జరుగుతోన్న కసరత్తును ప్రజలకు వివరించి.. బీఆర్ఎస్ , బీజేపీలకు ముకుతాడు వేయాలని రేవంత్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా నిర్లక్ష్యం చేసింది.? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వెంటనే హామీలకు శ్రీకారం చుట్టిన విధానంపై ప్రజల్లో చర్చ జరిగేలా రేవంత్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన రెండు రోజుల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతోపాటు వంద రోజుల్లో అమలైన ఐదు గ్యారంటీలతో ప్రజలకు కలిగిన మేలును రిపోర్ట్ రూపంలో ప్రజల ముందు ఉంచాలని రేవంత్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈమేరకు గత అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను శ్వేతపత్రం పేరిట రిలీజ్ చేశారో.. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వైఫల్యాలను కంపేర్ చేస్తూ కాంగ్రెస్ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్ళేలా వైట్ పేపర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.
పైగా, ఈసారి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు అవుతారని బీఆర్ఎస్ చెబుతోంది. కేసీఆర్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బీఆర్ఎస్ ను పూర్తిగా డిఫెన్స్ లో పడేసేలా వ్యూహంలో భాగంగా రేవంత్ ఆరు నెలల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ను ముందుంచనున్నట్లు తెలుస్తోంది.