రేవంత్ రెడ్డి రాజకీయాన్ని.. పాలనను వేర్వేరుగా చూస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూనే… పార్టీని కూడా బలోపేతం చేయాల్సి ఉంది. ఇందు కోసం ద్విముఖ వ్యూహం అమలు చేస్తున్నారు. కేంద్ర మంత్రుల్ని కలవాల్సి వస్తే … ఏ మాత్రం అవాయిడ్ చేయడం లేదు. బీజేపీ కేంద్ర మంత్రులు అయినా సరే రాష్ట్రానికి వస్తే ఇంటికి ఆహ్వానించి విందు ఇచ్చి… ఆయా కేంద్ర మంత్రుల శాఖలకు సంబంధించి తెలంగాణకు రావాల్సిన నిధులను ఏకరవు పెడుతున్నారు. ఆదివారం ఇలా తెలంగాణకు వచ్చిన పీయూష్ గోయల్ ను రేవంత్ రెడ్డి ఇంటికి ఆహ్వానించారు.
ఇటీవలి ఢిల్లీ పర్యటనలో పార్టీవ్యవహారాలతో పాటు ప్రభుత్వ వ్యవహారాలు చూసుకున్నారు. కేంద్రమంత్రుల్ని కలిసి రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి చర్చించారు. నిజానికి కాంగ్రెస్ సీఎంగా ఉండి ఇలా బీజేపీతో .. కేంద్ర మంత్రులతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపించడం రేవంత్ రెడ్డికి రిస్కే. కానీ ఆయన పార్టీలో తన నమ్మకాన్ని ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటేనే… కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చాలంటే.. ఎంతో కొంత కేంద్రం సహకారం తప్పనిసరి అవుతోంది.
రేవంత్ చేస్తున్న రాజకీయం కొంత మంది సీనియర్ నేతలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రేవంత్ బీజేపీతో బాగా క్లోజ్ గా వెళ్లిపోతున్నాడని వారు హైకమాండ్ కు ఫిర్యాదులు చేసే పరిస్థితులు కూడా లేకుండా పోతున్నాయి. ఎందుకంటే.. హైకమాండ్ దగ్గర కూడా ఆయనకు అంత వశ్వసనీయమైన లీడర్ అనే ముద్ర ఉంది. రేవంత్ ఇలా ఎవర్నీ నొప్పిచకుండా.. రాజకీయం , పాలన చేయడం.. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని సంతృప్తి పరుస్తోది.